Breaking News

తండ్రైన కేఎల్ రాహుల్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అతియా శెట్టి

Published on Mon, 03/24/2025 - 20:55

బాలీవుడ్‌ భామ అతియా శెట్టి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తనకు పాప పుట్టారని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో టీమిండియా స్టార్ క్రికెటర్‌ కేఎల్ రాహుల్‌ తండ్రి అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ స్టార్ జంటకు అభినందనలు చెబుతున్నారు. పలువురు సినీతారలు సైతం కంగ్రాట్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. గతంలోనే అతియాశెట్టి గర్భంతో ఉన్నట్లు రాహుల్‌ సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. ఈ ఏడాదిలోనే మా ఇంటికి అందమైన ఆశీర్వాదం రాబోతుందని  పోస్ట్‌ చేశారు.

కాగా.. అతియా శెట్టి బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది.  అతియా శెట్టి చివరిసారిగా 2019లో వచ్చిన చిత్రం 'మోతీచూర్ చక్నాచూర్'లో కనిపించింది. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన నటించింది. ఆమె మొదట 2015లో  'హీరో' మూవీ ద్వారా సూరజ్ పంచోలి సరసన బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అర్జున్ కపూర్ నటించిన 'ముబారకన్' సినిమాలో అతియా కీలక పాత్ర పోషించింది.

కేఎల్, అతియా శెట్టి ప్రేమ వివాహం

అయితే కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. కేఎల్ రాహుల్‌, అతియా శెట్టిల వివాహం 2023, జనవరి 23న ముంబయిలోని ఫామ్‌హౌస్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో బాలీవుడ్ సినీతారలు, పలువురు క్రికెటర్ల సందడి చేశారు.
 

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)