Breaking News

ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్.. తెలుగులోనూ

Published on Tue, 11/12/2024 - 07:40

తెలుగులో కమర్షియల్ సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. మలయాళంలో మాత్రం థ్రిల్లర్ మూవీస్ ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అలా సెప్టెంబరులో రిలీజైన ఓ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. రూ.5 కోట్లు పెడితే రూ.50 కోట్లు వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఆ మూవీనే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు.

అపర్ణ బాలమురళి, అసిఫ్ అలీ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ మూవీ 'కిష్కింద కాండం'. కోతుల బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల దృష్టిలోనూ పడింది. దీంతో ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశారు. ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చేసింది. నవంబర్ 19 నుంచి హాట్‌స్టార్‌లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.

(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ క్రిష్)

'కిష్కింద కాండం' విషయానికొస్తే.. అజయన్ (అసిఫ్ అలీ), అపర్ణ (అపర్ణ బాలమురళి) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కానీ అప్పటికే అజయన్‌కి పెళ్లయి బాబు కూడా పుడతాడు. కానీ భార్య చనిపోవడంతో ఈ పెళ్లి చేసుకుంటాడు. కానీ ఇది జరిగిన కొన్నిరోజులకే కొడుకు మాయమవుతాడు. ఆ కుర్రాడు ఏమైపోయాడు? అజయన్ తండ్రి వల్ల ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనేదే మిగతా స్టోరీ.

చివరి వరకూ సినిమాలో ట్విస్ట్‌ను కొనసాగించడంతో పాటు థ్రిల్‌ను ఏమాత్రం తగ్గనీయకుండా దర్శకుడు సినిమా తీశాడు. 'కిష్కింద కాండం' టైటిల్ పెట్టడానికి కూడా కారణముంది. కోతులు ఎక్కువగా కనిపించే ఆ ఊరిలో వింత సంఘటనలు జరుగుతుంటాయి. ఓ సందర్భంలో మనిషి శవం ఉండాల్సిన చోట కోతి శవం కనిపిస్తుంది. ఇలా మొదటి నుంచి చివరివరకు ట్విస్టులు, థ్రిల్స్ మిమ్మల్ని మైండ్ బ్లాక్ చేయడం గ్యారంటీ.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ అంటేనే ఇమేజ్‌ డ్యామేజ్‌.. ఎప్పుడు తెలుసుకుంటారో?)

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)