Breaking News

‘మేమ్ ఫేమస్' నటుడిగా మంచి గుర్తింపుని ఇచ్చింది: కిరణ్‌ మచ్చ

Published on Sat, 06/03/2023 - 11:11

సోషల్ మీడియాలో పాపులర్ అయిన కిరణ్ మచ్చ ఈ మధ్యనే మేం ఫేమస్ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో అల్లరి చిల్లరగా తిరిగే ముగ్గురు కుర్ర కారుకి అండగా నిలుస్తూ మీరు అనుకుంటే ఏదైనా సాధించగలరు అని వారికి వెన్నుతట్టే ఆ ఊరి సర్పంచ్ వేణు జింక అనే పాత్రలో నటించి అందరిని మెప్పించాడు. ఊరంతా ఆ కుర్రాళ్ళకి యాంటీ అయినా సరే వేణు మాత్రం వారి వెంట నిలబడి వారికి అండగా నిలబడటం ఆసక్తికరంగా ఉంటుంది.

అలా సర్పంచ్ పాత్రలో కిరణ్ మచ్చ అద్భుతంగా నటించి అందరి దృష్టిలో పడ్డాడు. ఇప్పుడు ఆయనకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అథర్వ, శ్రీరంగనీతులు, ఇంకా టైటిల్స్ ఖరారు కానీ మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఒకప్పుడు యూట్యూబర్‌గా ఫేమస్ అయిన కిరణ్‌ మచ్చ.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌ మీద వరుస ఆఫర్లు సంపాదించుకుంటున్నాడు. ‘‘మేమ్ ఫేమస్' నటుడిగా నాకు మంచి గుర్తింపును ఇచ్చింది. ఆ సినిమా కారణంగానే ఇప్పుడు వరుస ఆఫర్లు వస్తున్నాయి. అన్ని రకాల పాత్రలు పోషించి నటుడిగా మంచి పేరు సంపాదించుకోవాలనేదే నా కోరిక’ అని కిరణ్‌ మచ్చ అంటున్నాడు. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)