Breaking News

నన్ను కిందకు లాగుతున్నారు, ఇలాగైతే ఎలా?.. ట్రోలింగ్‌పై హీరో ఫైర్‌

Published on Wed, 02/22/2023 - 14:35

యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా నటించిన చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. మురళీ కిషోర్‌ అబ్బురు దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకుంది. ఫిబ్రవరి 18న విడుదలైన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ మంగళవారం ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో కిరణ్‌ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'ఈ సినిమాకు ప్రతిఒక్కరూ బాగా సపోర్ట్‌ చేశారు. కానీ కొన్ని బ్యాచులు తయారవుతున్నాయి. ట్విటర్‌లో నాపై కావాలని విషం చిమ్ముతున్నారు. ఇంతకుముందు చేసిన ఒకటీరెండు సినిమాలు బాలేవు, నన్ను విమర్శించారు. ఈ సారి ఎలాంటి విమర్శ రాకూడదని పకడ్బందీగా ప్లాన్‌ చేసి మంచి మంచి సీన్లు పెట్టాం. అయినా కూడా కొంతమంది సినిమా బాలేదంటున్నారు బ్రో అని మావాళ్లు కొన్ని మెసేజ్‌లను నాకు చూపిస్తున్నారు. అసలు ఎవరంటున్నారు? ఎందుకు బాలేదంటున్నారు అని వివరాలు ఆరా తీస్తే వాళ్లసలు ఇక్కడివాళ్లే కాదు.

ఎవరో కొందరు ఎవడికో రూ.50,000 ఇస్తే బాలేదని వరుస కామెంట్లు చేస్తున్నారు. ఇలాగైతే మాలాంటి యంగ్‌ హీరోలు ఎలా ఎదుగుతారు? మీరు నన్ను ఇంటికి పంపించేయాలనుకున్నా నేను వెళ్లను. ఇదే ఇండస్ట్రీలో ఉంటా. రూ.70,000 ఉద్యోగం వదిలేసి ఇక్కడిదాకా వచ్చా. నన్ను కిందకు లాగినా నాకేం పోదు. ట్విటర్‌ ఉంది కదా అని పొద్దున లేచినప్పటి నుంచి బూతు పురాణం ఎందుకు మొదలుపెడుతున్నారు? పక్కవాళ్ల మీద పడి ఏడవడం మానేయండి' అని ఓరకంగా వార్నింగ్‌ ఇచ్చాడు కిరణ్‌.

చదవండి: సినీ పరిశ్రమలో విషాదం

Videos

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు