Breaking News

ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌తో మీటర్‌ ట్రైలర్‌.. దుమ్ములేపిన కిరణ్‌ అబ్బవరం

Published on Wed, 03/29/2023 - 12:10

హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం. తాజాగా ఆయన మీటర్‌ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  రమేష్ కాడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా యంగ్‌ హీరోయిన్‌ అతుల్య రవి  ఇందులో నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా కిరణ్‌ అబ్బవరం పోలీస్‌ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ ఏప్రిల్‌ 7న విడుదల కాబోతోంది.

ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌ జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా మూవీ ట్రైలర్‌ విడుదల చేసింది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సీక్వెన్స్‌ ట్రైలర్‌ ఆసక్తిగా మలిచారు. ఈ ట్రైలర్‌ చూస్తుంటే కిరణ్‌ అబ్బవరం ఈసారి లవ్‌, రొమాన్స్‌, కామెడీ, పైట్స్‌తో ఫుల్‌ ఎంటర్‌టైన్‌ ఇవ్వబోతున్నాడని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తుంది. ఇందులోనిపవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌ అయితే బాగా ఆకట్టుకుంటున్నాయి.

‘భగవంతుడి ముందు భక్తితోను .. బలవంతుడి ముందు భయంతోను ఉండాలి’ అనే డైలాగ్ ట్రైలర్ కి హైలైట్‌గా నిలిచింది. కాగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. కిరణ్‌ అబ్బవరం కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇది. ఈ చిత్రానికి సాయి కార్తిక్‌ సంగీతం అందించాడు. ఇందులో కిరణ్ సరసన అతుల్యా రవి కథానాయికగా నటించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)