Breaking News

ఇక్కడ అమరన్‌ హిట్‌.. తమిళ్‌లో మాకు పది స్క్రీన్స్‌ ఇవ్వండి: కిరణ్‌

Published on Sat, 11/02/2024 - 17:07

'క' సినిమాతో భారీ విజయాన్ని కిరణ్‌ అబ్బవరం అందుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో 'క' సినిమాను విడుదల చేయాలనుకుంటే ఎదురైన ఇబ్బందుల గురించి ఆయన మాట్లాడారు. అదే సమయంలో అమరన్‌ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌ గురించి కూడా తన అభిప్రాయాన్ని తెలిపారు.

దీపావళి సందర్భంగా క సినిమాతో పాటు అమరన్‌ కూడా విడుదలైంది. అమరన్‌ పూర్తిగా తమిళ్‌ సినిమా.. ఇక్కడ తెలుగు డబ్బింగ్‌ వర్షన్‌లో మాత్రమే విడుదలైంది. తమిళనాడులో ఏ స్థాయిలో అయితే అమరన్‌కు థియేటర్స్‌ దక్కాయో తెలుగులో కూడా అంతే స్థాయిలో దక్కాయి అనేది నిజం. ఇప్పుడు ఇదే విషయాన్ని కిరణ్ అబ్బవరం పరోక్షంగా ఇలా చెప్పుకొచ్చారు. 

'తమిళనాడులో ఉండే మన తెలుగు వారు 'క' సినిమాను ఇక్కడ ఎందుకు విడుదల చేయలేదని కోరుతున్నారు. నేను కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. కానీ, అక్కడ తెలుగు సినిమాకు థియేటర్లు ఇవ్వలేదు. కనీసం తెలుగు వర్షన్‌లో విడుదలైతే చాలని కోరుకుంటున్నాను. మంచి విజయం సాధించిన సినిమాకు తమిళ్‌ కనీసం పది స్క్రీన్స్‌ ఇచ్చినా సంతోషమే. తమిళ్‌ సినిమా 'అమరన్'ను ఇక్కడ సూపర్ హిట్ చేశాం.. 'క' కోసం అక్కడ పది స్క్రీన్లు ఇస్తే చాలు అంటూ కిరణ్ అబ్బవరం కోరారు. ఇదే సమయంలో 'క' పార్ట్‌2 కూడా ఉంటుందని ఆయన ప్రకటించారు.

కిరణ్‌ అబ్బవరం హీరోగా, నయన్‌ సారిక, తన్వీ రామ్‌ హీరోయిన్లుగా నటించిన పీరియాడికల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ ‘క’. సుజీత్‌–సందీప్‌ దర్శకత్వంలో చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. రెండురోజులకు గాను ఈ చిత్రం రూ. 13.11 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టింది.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)