Breaking News

ఎవరు... ఏంటి... ఎక్కడ

Published on Tue, 10/29/2024 - 02:51

‘‘క’ సినిమా క్లైమాక్స్‌ను కొత్తగా చెప్పేందుకు ప్రయత్నించాం. నాకు తెలిసి ఈ తరహా క్లైమాక్స్‌ ఇప్పటివరకూ రాలేదు. అందుకే క్లైమాక్స్‌ను ఆడియన్స్‌ కొత్తగా ఫీలవుతారని, వాళ్లు ఆ అనుభూతికి లోను కాకపోతే నేను సినిమాలు చేయననే బోల్డ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాను. మేం ఓ కొత్త ప్రయత్నం చేశామని ప్రేక్షకులు కచ్చితంగా అనుకుంటారని గట్టిగా నమ్ముతున్నాను.

అయితే ఈ కొత్త ప్రయత్నాన్ని ఎలా రిసీవ్‌ చేసుకుంటారనే భయం కూడా ఉంది’’ అని కిరణ్‌ అబ్బవరం అన్నారు. కిరణ్‌ అబ్బవరం హీరోగా, నయన్‌ సారిక, తన్వీ రామ్‌ హీరోయిన్లుగా నటించిన పీరియాడికల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ ‘క’. సుజీత్‌–సందీప్‌ దర్శకత్వంలో చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం హీరో కిరణ్‌ అబ్బవరం చెప్పిన విశేషాలు.

∙కృష్ణగిరి అనే ఊరికి పోస్ట్‌మ్యాన్‌గా వచ్చిన అభినయ వాసుదేవ్‌ కథ ఇది. ఇతని ప్రేయసిగా సత్యభామ (నయన్‌) కనిపిస్తుంది. మరోటి రాధ (తన్వీ రామ్‌) పాత్ర. వాసుదేవ్, సత్యభామ పాత్రలతో రాధ కనెక్షన్‌ ఏంటి? అనేది సినిమాలో తెలుస్తుంది. ఈ సినిమా కథను సుజీత్, సందీప్‌ చెప్పినప్పుడు చాలా కొత్తగా ఫీలయ్యాను. నెక్ట్స్‌ ఏం జరుగుతుందో ఊహించలేకపోయాను. ‘ఎవరు... ఏంటి... ఎక్కడ’ అనే  పాయింట్స్‌తో ‘క’ చిత్రం ఉంటుంది. 1970 నేపథ్యంలో సాగే కథ ఇది. 

ఈ సినిమా కంటెంట్‌ ట్రీట్‌మెంట్‌ కొత్తగా ఉంటుంది. అందుకే పదే పదే మా మూవీ ఫ్రెష్‌గా ఉంటుందని చెబుతున్నాం. ∙‘క’ అంటే కొంతమంది కిరణ్‌ అబ్బవరం అనుకుంటున్నారు. కానీ ‘క’ ఏంటో సినిమా క్లైమాక్స్‌లో తెలుస్తుంది. సైకలాజికల్‌ సస్పెన్స్‌తో ఈ సినిమా ముందుకు వెళ్తుంది. ఇక మా సినిమాకు ఇద్దరు దర్శకులు ఉండటం బాగానే అనిపించింది. ఈ  సినిమాని మలయాళంలో దుల్కర్‌ సల్మాన్‌గారి నిర్మాణ సంస్థే రిలీజ్‌ చేయాల్సింది. కానీ ఆయన సినిమా ‘లక్కీ భాస్కర్‌’ మా సినిమా విడుదల తేదీనే వస్తుంది. 

తమిళంలో కూడా సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. అందుకే ‘క’ రిలీజ్‌ను ప్రస్తుతానికి తెలుగుకే పరిమితం చేశాం. ∙ఈ మధ్యే పెళ్లి (‘రాజావారు రాణిగారు’ సినిమాలో తన సరసన హీరోయిన్‌గా నటించిన రహస్యా గోరక్‌ని కిరణ్‌ పెళ్లి చేసుకున్నారు) చేసుకున్నాను. నా మ్యారీడ్‌ లైఫ్‌ బాగుంది. నా పెళ్లి తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా కాబట్టి ‘క’ విజయం సాధిస్తే సంతోషంగా ఉంటుంది.

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)