Breaking News

మళ్లీ బిజినెస్‌ మొదలుపెట్టిన కిర్రాక్‌ ఆర్పీ

Published on Mon, 01/09/2023 - 20:20

స్కిట్లతో కడుపుబ్బా నవ్వించే కిర్రాక్‌ ఆర్పీ గత కొంతకాలంగా కామెడీ షోలు చేయడమే మానేశాడు. తనకంటూ సొంతంగా బిజినెస్‌ పెట్టాలనుకున్న ఆయన గత నెలలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట హైదరాబాద్‌లో ఓ కర్రీ పాయింట్‌ ప్రారంభించాడు. ఈ బిజినెస్‌ ఊహించినదానికన్నా ఎక్కువ స్థాయిలో హిట్‌ అయింది. కర్రీ పాయింట్‌కు పెద్ద సంఖ్యలో జనాలు పోటెత్తారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతుండటంతో తాత్కాలికంగా కర్రీపాయింట్‌ను క్లోజ్‌ చేశాడు ఆర్పీ. డిమాండ్‌కు తగ్గట్టుగా సప్లై ఉండాలన్న ఆలోచనతో నెల్లూరు వెళ్లి అక్కడ చేపల పులుసు పోటీ పెట్టాడు.

బాగా రుచికరంగా వండిన కొందరు మహిళలను హైదారాబాద్‌కు తీసుకొచ్చి తిరిగి కర్రీపాయింట్‌ ప్రారంభించాడు. డప్పుచప్పుళ్ల మధ్య కేక్‌ కట్‌ చేసి షాప్‌ను తిరిగి ఓపెన్‌ చేశాడు. నెల్లూరు నుంచి తీసుకొచ్చిన మహిళలకు ప్రస్తుతానికి తన ఇంట్లోనే ఆతిథ్యమిచ్చాడు ఆర్పీ. మహిళలందరూ ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి వంట మొదలుపెడతారని నాలుగు గంటల్లో వంట పూర్తవుతుందని చెప్పుకొచ్చాడు. తమ కర్రీ పాయింట్‌కు ఇప్పుడు కూడా ఎక్కువ సంఖ్యలో జనాలు వస్తున్నారని సంతోషం వ్యక్తం చేశాడు ఆర్పీ.

చదవండి: కేజీఎఫ్‌ సినిమాలో యశ్‌ ఉండడు: నిర్మాత

Videos

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ సీరియస్ నేతల ఫైర్

మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)