Breaking News

తు మిల్‌ జాయే...

Published on Tue, 11/03/2026 - 01:06

‘తు మిల్‌ జాయే’ అంటూ లవ్‌సాంగ్‌ వినిపించారు షారుక్‌ ఖాన్  . ‘పఠాన్  ’ (2023) వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత హీరో షారుక్‌ ఖాన్  , దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ కాంబినేషన్  లో రూపొందుతోన్న హిందీ సినిమా ‘కింగ్‌’. దీపికా పదుకొనె హీరోయిన్  గా నటిస్తున్న ఈ చిత్రంలో అభిషేక్‌ బచ్చన్  , సుహానా ఖాన్   ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సోమవారం (నవంబరు 2)న షారుక్‌ బర్త్‌ డే.

ఈ సందర్భంగా ‘కింగ్‌’ సినిమా నుంచి ‘తు మిల్‌ జాయే..’ పాటను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. సచిన్‌–జిగర్‌ ద్వయం స్వర పరచిన ఈ పాటకు కుమార్‌ సాహిత్యం అందించగా, అరిజిత్‌ సింగ్, మధుబంతి బాగ్చి పాడారు. పీయూష్‌–షాజియా కొరియోగ్రఫీ చేశారు. ఎడ్‌ షీరన్‌ ఈ పాటలోని ఇంగ్లీష్‌ ర్యాప్‌ను పాడారు. ‘నేను హంతకుడిని కాదు.. ప్రేమికుడిని. నా గురి నా ప్రేయసి గుండెపైనే. గుండెను చీల్చలేనివాడు అసలు ప్రేమికుడే కాదు’, ‘ఈసారి గుండెలో మంట మొదలైంది.. ఇప్పుడు ప్రపంచాన్ని తగలబెట్టే వరకు అది ఆగదు’ అని అర్థం వచ్చే డైలాగ్స్‌ కూడా ఈ పాటలో ఉన్నాయి.

‘‘కింగ్‌’ సినిమాలో షారుక్‌ పాత్రలోని మరో కొత్త కోణాన్ని ఈ పాట ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది. సినిమా కథ, హీరో క్యారెక్టర్‌లోని డిఫరెంట్‌ షేడ్స్‌ ఎలా ఉండబోతున్నాయో కూడా ఈ పాటతో తెలుస్తుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్  మెంట్, మార్‌ఫ్లిక్స్‌ పిక్చర్స్‌ పతాకాలపై గౌరీఖాన్  , మమతా ఆనంద్‌ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 24న  రిలీజ్‌ కానుంది.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)