Breaking News

గౌరవ డాక్టరేట్‌కు నో చెప్పిన కిచ్చా సుదీప్‌.. అభినందిస్తున్న ఫ్యాన్స్‌

Published on Tue, 08/06/2024 - 13:13

కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌కు అన్ని భాషల్లోనూ అభిమానులు ఉన్నారు. సుమారు 28 ఏళ్లుగా అక్కడ చిత్ర పరిశ్రమకు ఆయన సేవలు అందిస్తున్నారు. అందుకు గుర్తింపుగా అందివచ్చిన డాక్టరేట్‌ను ఆయన కాదన్నారు. టాలీవుడ్‌లో ఈగ సినిమాతో ఇక్కడ వారికి బాగా దగ్గరయిన కిచ్చా సుదీప్‌ ఆ తర్వాత బాహుబలి సినిమాతో మెప్పించారు. దీంతో గతేడాది విడుదలైన విక్రాంత్‌ రోణా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా ఆధరించారు.

వినోదం, నటనలో నటుడు కిచ్చా సుదీప్ చేసిన సేవలను కర్ణాటకలోని తుమకూరు విశ్వవిద్యాలయం గుర్తించింది. దీంతో ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయాలని నిర్ణయించింది. వీవీ సిండికేట్ సమావేశంలో జరిగిన ఈ చర్చను సుదీప్ పీఏ ద్వారా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రెండు రోజుల తర్వాత సుదీప్ రిప్లై ఇచ్చారు. అయితే, అందివచ్చిన గౌరవాన్ని కిచ్చా సుదీప్‌ వదులుకున్నారు.  యూనివర్శిటీ నిర్ణయం పట్ల  సుదీప్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఇలా చెప్పారు. 'సమాజానికి సేవ చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. నాకంటే కూడా వాళ్లే ఎక్కువ చేస్తున్నారు. వారిని గుర్తించి ఈ డాక్టరేట్ ఇస్తే బాగుంటుంది. నాకు ఇంకా అంతటి స్థాయి రాలేదు అనుకుంటున్నాను.'  అంటూ యూనివర్సిటీ ఇచ్చిన గౌరవాన్ని సుదీప్‌ నిరాకరించారు. 

యూనివర్సిటీ స్నాతకోత్సవ విలేకరుల సమావేశంలో తుమకూరు యూనివర్సిటీ ఛాన్సలర్ వెంకటేశ్వర్లు ఈ వివరాలు వెల్లడించారు. ఆగస్టు 17న తుమకూరు యూనివర్సిటీ క్యాంపస్‌లో గౌరవ డాక్టరేట్‌ ప్రదానోత్సవం జరగనుంది. తుమకూరు యూనివర్సిటీ నుంచి ఈసారి ముగ్గురు గౌరవ డాక్టరేట్లను ప్రకటించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)