Breaking News

స్టార్‌ హీరో రిటైర్మెంట్‌.. నటిగా కూతురు ఎంట్రీకి లైన్‌ క్లియర్‌

Published on Sat, 03/15/2025 - 10:12

కన్నడ హీరో కిచ్చా సుదీప్‌ 28 సంవత్సరాలుగా ఎన్నో సినిమాలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. రీసెంట్‌గా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రిటైర్మెంట్‌ ప్లాన్‌ గురించి చర్చించారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆయన కూతురు సాన్వీ సుదీప్‌ చిత్ర పరిశ్రమలో అడుపెట్టబోతున్నట్లు ప్రకటించింది. దీంతో ఆయన అభిమానులు సోషల్‌మీడియాలో సాన్వీకి స్వాగతం పలుకుతున్నారు. కిచ్చా సుదీప్‌ నటించిన తాజా చిత్రం మ్యాక్స్‌ మంచి ఆదరణ పొందింది. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. తాను ఇంకా అలసిపోలేదని అయితే ఏదో సమయంలో తాను నటన నుంచి వైదొలిగే అవకాశం ఉందని షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు.

సినిమా పరిశ్రమ నుంచి కిచ్చా సుదీప్‌ వైదొలిగిపోతానని చేసిన కామెంట్లు ఇప్పటికీ వైరల్‌ అవుతూనే ఉన్నాయి. ఇంతలోనే ఆయన కూతురు సాన్వీ ఒక పాడ్‌కాస్ట్‌లో ఇలా చెప్పుకొచ్చింది.   'సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పటకే హైదరాబాద్‌లో 4 నెలల వర్క్‌షాప్‌లో శిక్షణ కూడా పూర్తి చేశాను. నా సొంతంగా అవకాశాలు తెచ్చుకోవాలని ఎదురుచూస్తున్నాను. నాన్న పేరు చెప్పుకుంటే అవకాశాలు వెంటనే దొరుకుతాయి. కానీ, నాకు అలా అవకాశం దక్కించుకోవడం ఇష్టం లేదు. అందుకే నేను నటి అయ్యేందుకు మరికొంత సమయం పట్టొచ్చు. ఇంతలో నేను దర్శకత్వం, స్క్రిప్ట్ రైటింగ్‌లో రాణించే ప్రణాళికలు పెట్టుకున్నాను. పరిశ్రమలో ఉన్న అన్ని విభాగాల్లోనూ నేను ప్రయత్నించాలనుకుంటున్నాను. కానీ, నా అసలైన టార్గెట్‌ నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే..' అని ఆమె చెప్పింది.

తాను చాలా కాలంగా అధిక బరువుతో బాధపడుతున్నానని, అందువల్ల నటిగా చేరుకోవడానికి కొంత సమయం పడుతుందని సాన్వీ సుదీప్‌ నిజాయితీగానే చెప్పంది. ఈలోగా, తాను కెమెరా వెనుక జరిగే పనుల్లో ఉంటానని ఆమె తెలిపింది. ఇప్పటి వరకు పలు పాటలు పాడిన ఆమె హీరోయిన్‌గా మాత్రమే నటించాలని కోరిక తనకు లేదని కూడా చెప్పింది.  ఎలాంటి పాత్ర వచ్చినా సరే చేస్తానని ఆమె తెలిపింది. అయితే, ఫైనల్‌గా సాన్వీ ఎంట్రీ ఉంటుందని క్లారిటీ ఇచ్చేసింది.

సాన్వీకి సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. మంచి సింగర్‌ కూడా. ఇప్పటికే పలు మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ చేసింది. సుదీప్ మేనల్లుడు నటించిన ‘జిమ్మీ’ సినిమాలో ఓ పాట కూడా ఆమె పాడింది. త్వరలోనే ఈ బ్యూటీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కన్నడ మీడియాలో కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అవన్నీ నిజం చేస్తూ.. సినిమా ప్రపంచంలో తన ఎంట్రీ ఉంటుందని సాన్వీ పేర్కొంది. ఓ స్టార్‌ డైరెక్టర్‌ ఆమెను హీరోయిన్‌గా పరిచయం చేయబోతున్నాడని తెలుస్తోంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)