Breaking News

కూతురి పేరు వెల్లడించిన గేమ్‌ ఛేంజర్‌ బ్యూటీ

Published on Fri, 11/28/2025 - 13:44

బాలీవుడ్‌ హీరోయిన్‌, గేమ్‌ ఛేంజర్‌ బ్యూటీ కియారా అద్వానీ ఇటీవలే తల్లిగా ప్రమోషన్‌ పొందింది. కియారా- సిద్దార్థ్‌జంటకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. శుక్రవారం నాడు పాప పేరును సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. అలాగే ఓ ఫోటోను సైతం షేర్‌ చేశారు. మా ప్రార్థనల నుంచి మా చేతుల్లోకి వచ్చిన మా బుజ్జిపాపాయి.. సరాయా మల్హోత్రా (Saraayah Malhotra) అని రాసుకొచ్చారు. 

సిద్దార్థ్‌లోని స అక్షరాన్ని, కియారా(Kiara Advani) లోని యారా అక్షరాలను కలిపితే వచ్చేలా సరాయా అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది. సరాయా అంటే అరబిక్‌లో యువరాణి అని అర్థం.  అయితే పాప ముఖాన్ని మాత్రం చూపించలేదు. కేవలం సాక్సులు తొడిగిన పాప కాళ్లను పట్టుకున్న ఫోటో మాత్రమే షేర్‌ చేశారు. ఏదేమైనా కియారా జంటకు అభిమానులు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సిద్దార్థా- కియారా 2023 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది జూలై 15న వీరికి కూతురు పుట్టింది.

సినిమాలు
సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న కియారా తెలుగులో మాత్రం పెద్దగా క్లిక్కవ్వలేదు. మహేశ్‌బాబు సరసన 'భరత్‌ అనే నేను', రామ్‌చరణ్‌ సరసన 'వినయ విధేయ రామ', 'గేమ్‌ ఛేంజర్‌' చిత్రాలు చేసింది. ఈ ఏడాది హృతిక్‌ రోషన్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ల మల్టీస్టారర్‌ 'వార్‌ 2' మూవీలో తళుక్కుమని మెరిసింది.  ప్రస్తుతం యష్‌ హీరోగా నటిస్తున్న 'టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌' సినిమాలో నటిస్తోంది. సిద్దార్థ్‌ మల్హోత్రా చివరగా 'పరమ సుందరి' సినిమా చేశాడు. ప్రస్తుతం 'వాన్‌: ఫోర్స్‌ ఆఫ్‌ ద ఫారెస్ట్‌' మూవీలో యాక్ట్‌ చేస్తున్నాడు.

 

 

చదవండి: 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)