మంత్రి టీజీ భరత్ అనుచరుడు వేధింపులకు యువకుడు బలి
Breaking News
యశ్‌తో బోల్డ్ సీన్స్.. తొలగించాలంటూ హీరోయిన్ విజ్ఞప్తి!
Published on Sun, 05/03/2026 - 11:51
కేజీయఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కన్నడ స్టార్ యశ్ నటించిన పాన్ వరల్డ్ చిత్రం టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చిలోనే విడుదల కావాల్సింది. కానీ చివరి నిమిషంలో జూన్ 4వ తేదికి వాయిదా వేశారు. ఇప్పుడు జూన్‌లో కూడా ఈ చిత్రం విడుదల కావడం లేదు. సినిమా ఔట్‌పుట్ బాగా వచ్చిందని..ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సినిమా ప్రమోషన్స్ కోసమే వాయిదా వేస్తున్నట్లు యశ్ ప్రకటించారు. కొత్త తేదిని త్వరలో ప్రకటించనున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ గాసిప్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ.. చిత్రబృందానికి వింత విజ్ఞప్తి చేసిందట. షూటింగ్ సమయంలో కథ డిమాండ్ మేరకు యశ్, కియారాల మధ్య కొన్ని బోల్డ్ సీన్లు చిత్రీకరించారట.
ఇలాంటి సన్నివేశాలు ఉంటాయని కియారాకి ముందే చెప్పారట. ఆమె అన్నింటికి ఒప్పుకొనే సినిమాకు సైన్ చేసిందట. ఇష్టంతోనే బోల్డ్ సీన్లు చేసినప్పటికీ.. ఫైనల్ కట్ చూసి ఇప్పుడు ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. బోల్డ్ సీన్లు తెరపై మరింత ఘటూగా ఉన్నాయని..వాటిని అలాగే చూపిస్తే తన ఇమేజ్‌పై ప్రభావం పడుతుందని భయపడుతుందట. అందుకే వాటిని తొలగించడా లేదా నిడివి తగ్గించే ప్రయత్నం చేయమని దర్శకురాలికి రిక్వెస్ట్ చేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అయితే ఆయా సన్నివేశాలు కథకి చాలా కీలకమని..వాటిని తొలగిస్తే సినిమాలోని భావోద్వేగ తీవ్రత తగ్గుతుందని భావిస్తున్నారట. మరి కియారా రిక్వెస్ట్ మేరకు ఆ సీన్లను తొలగిస్తారా లేదా అలానే ఉంచుతారా అనేది తెలియాలంటే రిలీజ్ వరకు ఎదురు చూడాల్సిందే.
Tags : 1