Vizianagaram: పలుచోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సిరాజ్ అంగీకారం
Breaking News
మెట్ గాలాలో మెరిసిన గేమ్ ఛేంజర్ హీరోయిన్.. బేబీ బంప్‌తో ఎంట్రీ!
Published on Tue, 05/06/2025 - 09:49
ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో గేమ్ ఛేంజర్ హీరోయిన్ కియారా అద్వానీ మెరిసింది. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్‌లో జరిగిన మెట్‌గాలాలో బాలీవుడ్ సినీ తారలంత సందడి చేశారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ స్పెషల్ అట్రాక్షన్ నిలిచింది. తన బేబీ బంప్‌తో వేదికపై ఎంట్రీ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ప్రముఖ భారతీయ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన దుస్తులను కియారా ధరించి ఈవెంట్‌లో మెరిసింది.
కాగా..'సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్' అనే థీమ్‌తో మెట్ గాలా- 2025 ఈవెంట్ నిర్వహిస్తున్నారు. బేబీ బంప్‌తో మెట్ గాలా కార్పెట్‌పై ఎంట్రీ ఇచ్చిన మొదటి భారతీయ నటిగా నిలిచింది. ఈ సందర్భంగా నా జీవితంలో ఒక నటిగా, కాబోయే తల్లిగా మెట్ గాలా అరంగేట్రం చేయడం చాలా ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తోందని కియారా పేర్కొంది. నా స్టైలిస్ట్ లుక్‌ను డిజైన్ చేయడానికి గౌరవ్ సృష్టించిన డ్రెస్ కోడ్ చాలా అందంగా ఉందని తెలిపింది.
సినిమాల విషయానికొస్తే కియారా అద్వానీ చివరిసారిగా రామ్ చరణ్ సరసన కనిపించింది. శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన గేమ్ ఛేంజర్ చిత్రంలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడంలో సక్సెస్ కాలేకపోయింది. కాగా.. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ కొత్త ఏడాదిలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే కియారా దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు.
Tags : 1