Breaking News

మీ నవ్వులు చూడాలనుకుంటున్నా– విజయ్‌ దేవరకొండ 

Published on Wed, 08/16/2023 - 00:32

‘‘నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నా సక్సెస్‌లో, ఫెయిల్యూర్స్‌లో ఇంత ప్రేమ ఇచ్చిన మీకు(ఫ్యాన్స్‌) థ్యాంక్స్‌. జీవితంలో చాలా మారాయి. ఎత్తు, పల్లాలు చూస్తున్నా. నా చుట్టూ మనుషులు మారుతున్నారు.. నా గురించి ఏదో మాట్లాడతారు. కానీ, మీ (ఫ్యాన్స్‌) ప్రేమ స్థిరంగా ఉంటుంది.. అందుకే సెప్టెంబర్‌ 1న మీ మొహాల్లో నవ్వులు చూడాలనుకుంటున్నా’’ అని హీరో విజయ్‌ దేవరకొండ అన్నారు.

శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 1న విడుదలవుతోంది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ‘ఖుషి మ్యూజికల్‌ కన్సర్ట్‌’ లో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ–‘‘నీ మొహంలో నవ్వు చూడాలని మాత్రమే పనిచేస్తున్నా’ అంటూ గత నెల రోజులుగా చెబుతున్నాడు శివ నిర్వాణ. నాక్కూడా నవ్వులు చూడాలని ఉంది. కానీ, నాకంటే ఎక్కువగా సమంత మొహంలో నవ్వులు చూడాలని ఉంది. తను ఈ సినిమా కోసం ఎంతో కష్టపడింది.

అలాగే శివ నిర్వాణలోనూ నవ్వులు చూడాలనుంది’’ అన్నారు. సమంత మాట్లాడుతూ–‘‘మీ కోసం(అభిమానులు, ప్రేక్షకులు) కష్టపడుతున్నాను.. తిరిగి ఆరోగ్యంగా వస్తాను.. ‘ఖుషి’తో బ్లాక్‌ బస్టర్‌ ఇస్తానని మీకు మాట ఇస్తున్నాను’’ అన్నారు. శివ నిర్వాణ మాట్లాడుతూ–‘‘ఖుషి’  చూస్తే మీకు(ప్రేక్షకులు) విజయ్, సమంత కనిపించరు.. విప్లవ్, ఆరాధ్య మాత్రమే కనిపిస్తారు. సినిమా చూసి బయటికెళ్లేటప్పుడు ఈ మూవీని మరోసారి చూద్దామనిపిస్తుంది’’ అన్నారు. ‘‘డియర్‌ కామ్రేడ్‌’ మేము అనుకున్నంత విజయం సాధించలేదు. కానీ ‘ఖుషి’ పెద్ద హిట్‌ కాబోతోంది’’ అన్నారు నవీన్‌ యెర్నేని.

‘‘శివ నిర్వాణతో మా బ్యానర్‌లో మరో సినిమా చేయనున్నాం’’ అన్నారు వై.రవిశంకర్‌. ‘‘ఖుషి మ్యూజికల్‌ కన్సర్ట్‌’కి విచ్చేసిన విజయ్, సమంతలకి థ్యాంక్స్‌. ఈ వేడుకని గ్రాండ్‌గా చేసేందుకు సహకారం అందించిన నవీన్, రవిశంకర్, దినేశ్‌గార్లకు కృతజ్ఞతలు’’ అన్నారు చిత్ర సంగీత దర్శకుడు హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌. ఈ కార్యక్రమంలో మైత్రీ మూవీస్‌ సీఈవో చెర్రీ, కెమెరామేన్‌ జి.మురళి, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి తదితరులు పాల్గొన్నారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)