Breaking News

సినీ రంగంలోకి ఖుష్బూ చిన్న కూతురు

Published on Thu, 05/21/2026 - 08:40

సినీ రంగంలో వారసుల ఎంట్రీ ఎప్పటినుంచో ఉంది. ఆ వరుసలో ఇప్పుడు దర్శకుడు సుందర్‌ సి- నటి ఖుష్బూ దంపతుల కూతురు చేరింది. ఖుష్బూ దంపతులకు అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కూతుర్లు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో అవంతిక ఇటీవలే కథానాయికగా పరిచయమైంది. తాజాగా ఆనందిత నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. 

నిర్మాతగా..
అవ్నీ మూవీస్‌ అధినేత కుష్బూ సుందర్‌, బెంజ్‌ మీడియా అధినేత సీసీఎస్‌ అరుణ్‌కుమార్‌ కలిసి నిర్మిస్తున్న డబుల్‌ ఆక్యుపెన్సీ చిత్రానికి ఆనందిత సుందర్‌ క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలను నిర్వహిస్తోంది. ఈ చిత్రం ద్వారా అశ్విన్‌ కందస్వామి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంతోష్‌, రేష్మా వెంకటేష్‌, సంయుక్తా విశ్వనాథ్‌, వీనోద్‌ కిషన్‌, వీటీవీ.గణేశ్‌, భగవత పేరుమాళ్‌, బోస్‌ వెంకట్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం జూన్‌ నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. 

రెండు సినిమాలు..
చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఒక వ్యక్తిలో రెండు ఆత్మలు చోటు చేసుకుంటాయని, అవి మరో ఇద్దరితో చేసే ప్రేమాయణం అనే ఫాంటసీ కథాంశంతో రూపొందించిన చిత్రం డబుల్‌ ఆక్యుపెన్సీ అని చెప్పారు. వినోదాన్ని జోడించి యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టెయినర్‌గా రూపొందించిన చిత్రం ఇదని చెప్పారు. ఈ చిత్రానికి సంతోష్‌కుమార్‌ చక్రవర్తి చాయాగ్రహణం, శ్యామ్‌.సీఎస్‌ సంగీతాన్ని అందించారు. ఆనందిత సుందర్‌.. మీసయ్య మురుక్కు సీక్వెల్‌ సినిమాకు సైతం ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోంది. గతంలో ఎంతో బొద్దుగా ఉన్న ఆనందిత.. ఇప్పుడు సన్నజాజి తీగలా మారిపోయింది.

 

 

Videos

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా

మృత్యు మేఘాలు వచ్చేసాయ్.. జాగ్రత!

క్లైమాక్స్ చూస్తే షాక్ అవుతారు.. ఉప్పెన కి మించి TWIST

గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం

పుల్వామా ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హమ్జా హతం

గుర్తుపెట్టుకో చంద్రబాబు.. ఇవే నీకు చివరి ఎన్నికలు..

నిప్పుల కుంపటి..! తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన ఉష్టోగ్రతలు

బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్ట్ చేశాం : రేవంత్ రెడ్డి

బొంతు శ్రీదేవితో మాకు ప్రాణహాని.. సీఎం సార్ మమ్మల్ని కాపాడండి

మరో వివాదంలో సీఎం విజయ్

Photos

+5

డేవిడ్ రెడ్డి టీమ్‌తో మంచు మనోజ్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

వడ్డే నవీన్ రీ ఎంట్రీ.. త్రిమూర్తులు టీజర్ లాంఛ్‌ (ఫోటోలు)

+5

వాటికన్ సిటీలో నయనతార దంపతుల సందడి.. ఫోటోలు

+5

చిరంజీవి 158వ మూవీ లాంచ్‌ (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ ఎండలు.. అల్లాడిపోతున్న జనం (ఫొటోలు)

+5

‘పెద్ది’ కష్టం చూశారా? అయితే ఈ ఫోటోలు చూడాల్సిందే

+5

సింప్లీ సూపర్బ్‌ అనిపించేలా మహేశ్‌బాబు మేనకోడలు (ఫోటోలు)

+5

తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు (ఫొటోలు)

+5

ఫుల్ హ్యాపీగా త్రిష.. అటు విజయ్ ఇటు సూర్య (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ కూతురి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)