Breaking News

బాడీపై ట్రోల్స్‌.. ఖుష్బు సుందర్‌ కూతురు రియాక్షన్‌..!

Published on Thu, 06/18/2026 - 12:44

కోలీవుడ్ నటి ఖుష్బు సుందర్ గురించి పరిచయం ‍అక్కర్లేదు. చిరంజీవి స్టాలిన్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీలో మెగాస్టార్‌కు అక్క పాత్రలో కనిపించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తూనే రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. 

అయితే ఇటీవల ఖుష్బు కూతురు ఆనందితా సుందర్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. తాను బరువు తగ్గేందుకు ఓజెంపిక్, మౌంజారో లాంటి ఇంజెక్షన్స్ వాడారని రూమర్స్ వైరలయ్యాయి. అంతేకాకుండా  శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారని ఊహాగానాలొచ్చాయి. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆనందిత తనపై వచ్చిన విమర్శలు, రూమర్స్‌పై స్పందించింది. తాను ఏమి చేసినా తనపై ఏదో ఒక విమర్శలు కొనసాగుతూనే ఉంటాయని తెలుసుకున్నానని ఆనందిత అన్నారు.

కొన్నేళ్లుగా ఆన్‌లైన్ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటూ ఉన్నానని గుర్తు చేసుకున్నారు. టీనేజ్‌లో ఉన్నప్పుడు అధిక బరువు కారణంగా తనను ఎగతాళి చేశారని తెలిపింది.  ఇప్పుడేమో తాను బరువు ఎలా తగ్గాననే దానిపై రూమర్స్ వింటున్నానని ఆనందిత చెప్పారు. నాపై ఈ ద్వేషం ఎప్పటికీ ఆగదని  గ్రహించానని అన్నారు. తన ఫిట్‌నెస్ గురించి వాస్తవాలు తెలియకపోయినా ప్రజలు కల్పిత కథలు అల్లుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

బరువు తగ్గేందుకు తాను ఎలాంటి మందులు కానీ.. శస్త్రచికిత్స చేయించుకోలేదని ఆనందిత తెలిపింది. తన బరువు తగ్గేందుకు 2018 నుంచే ప్లాన్ చేసుకున్నానని వెల్లడించింది. ఈ దశకు చేరుకోవడానికి దాదాపు ఏడు సంవత్సరాలు పట్టిందని ఆనందిత చెప్పుకొచ్చింది. దీని వెనుక ఉన్న నా కృషిని అర్థం చేసుకోకుండా ప్రజలు తొందరపాటు నిర్ణయానికి వచ్చేస్తారని అన్నారు.

తాను.. అక్క అవంతిక ఇద్దరం కూడా చిన్నప్పుడు బొద్దుగా ఉండేవారని తెలిపింది. ఆ తర్వాత ఊబకాయం బారిన పడ్డామని ఆనందిత వెల్లడించింది. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఫిట్‌గా మారడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నామని వివరించింది. తనకు కేవలం 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తన బాడీ గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారని ఆనందిత ప్రశ్నించింది.

కాగా.. ఆనందిత ప్రస్తుతం క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఎంట్రీ ఇచ్చారు. 'డబుల్ ఆక్యుపెన్సీ' చిత్రంతో అరంగేట్రం చేశారు. ప్రస్తుతం 'మీసయ మురుక్కు 2'  అనే సీక్వెల్‌ కూడా పనిచేస్తున్నారు. ఆమె గతంలో 'పొన్నియిన్ సెల్వన్: II' మూవీకి మణి రత్నంతో కలిసి పనిచేశారు.  అంతేకాకుండా 'థగ్ లైఫ్' చిత్రానికి సహాయ దర్శకురాలిగా కూడా ఉన్నారు.

 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు