Breaking News

కుష్బూ వారసురాలిద్దరూ రెడీ..

Published on Sun, 02/15/2026 - 15:23

ఉత్తరాది నుంచి దక్షిణాదికి దిగుమతి అయిన నటి కుష్బూ హిందీలో బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ సంచలన నటి ఆ తరువాత తెలుగులో వెంకటేష్‌కు జంటగా కలియుగ పాండవులు చిత్రంలో కథానాయికిగా పరిచయమయ్యారు. ఆ తరువాత వరుషం– 16 చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. విశేషం ఏమిటంటే ఈమె తెలుగు, తమిళం భాషల్లో నటించిన రెండు చిత్రాలు విజయం సాధించాయి. ఆ తరువాత ఈ రెండు భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించారు. తమిళంలో రజనీకాంత్, కమలహాసన్, విజయకాంత్, ప్రభు, కార్తీక్‌ వంటి నటులతో జంటగా నటించారు. కథానాయకిగా బిజీగా ఉండగానే దర్శకుడు సుందర్‌.సి ని ప్రేమ వివాహం చేసుకున్నారు. 

ఆ తరువాత రాజకీయ రంగప్రవేశం చేసి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రచార కర్తగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మరో పక్క నిర్మాతగా చిత్రాలు నిర్మిస్తున్నారు. సుందర్‌.సి, కుష్బూ దంపతులకు అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇప్పుడు వారు కూడా సినీ రంగప్రవేశం చేయడం విశేషమేమీ కాదు. చిన్న కూతురు ఆనందిత దర్శకుడు మణిరత్నం వద్ద సహాయ దర్శకురాలిగా చేరారు. పొన్నియిన్‌ సెల్వన్‌ 1, 2, థగ్‌లైఫ్‌ చిత్రాలకు పని చేశారు. 

పెద్ద కూతురు అవంతిక హీరోయిన్‌గా రంగప్రవేశం చేశారు. ఈమె లండన్‌లో నటనలో శిక్షణ పొందారన్నది గమనార్హం. ఇటీవల ఒక వాణిజ్య ప్రకటనలో నటించి తల్లి కుష్బూ ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ఆరంభం అనే మలయాళ చిత్రంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో సరిత మరో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. సురేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ తాజాగా ప్రారంభమైంది. అవంతిక త్వరలో తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ అవుతారని ఆశించవచ్చు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)