Breaking News

విశాల్‌ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు.. అసలు విషయం ఇదీ: ఖుష్భూ

Published on Wed, 01/08/2025 - 10:10

కోలీవుడ్‌ హీరో విశాల్‌( Vishal) అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ‘మదగజరాజ’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన వణుకుతూ మాట్లాడారు. అంతకు ముందు కొన్నాళ్ల పాటు కెమెరాకు కనిపించలేదు. సడెన్‌గా ఈవెంట్‌లో కనిపించి.. అలా వణుకుతూ మాట్లాడడంతో తమ హీరోకి ఏమైందోనని అభిమానులు కంగారు పడ్డారు. ఆయన జ్వరంతో బాధపడుతన్నాడని వైద్యులు చెప్పినప్పటికీ.. విశాల్‌ హెల్త్‌పై రకరకాల పుకార్లు వస్తున్నాయి. అసలు విశాల్‌కి ఏమైందనే విషయాన్ని తాజాగా నటి ఖుష్బూ(khushboo sundar) వివరించింది.

కంగారు పడాల్సిన అవసరం లేదు
తాజాగా ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..విశాల్‌ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పారు. ‘ఢిల్లీలో ఉన్నప్పుడే విశాల్‌కి జ్వరం వచ్చింది. కానీ 12 ఏళ్ల తర్వాత ‘మదగజరాజ’ రిలీజ్‌ అవుందుని ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ఈవెంట్‌కి వచ్చాడు. అప్పటికే విశాల్‌ డెంగీ ఫీవర్‌తో బాధపడుతున్నాడు. 103 డిగ్రీల జ్వరం కారణంగా వణికిపోయారు.  ‘ఇంత జ్వరంతో ఎందుకు వచ్చావు?’అని అడిగితే.. ‘నేను నటించిన చిత్రం 12 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ఈవెంట్‌కి కచ్చితంగా రావాలనుకున్నాను. అందుకే బాడీ సహకరించకపోయినా వచ్చేశాను’ అని విశాల్‌ చెప్పారు. ఈ ఈవెంట్‌ పూర్తయిన వెంటనే విశాల్‌ని ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. కంగారుపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు. అయినా కూడా కొంతమంది యూట్యూబర్స్‌ విశాల్‌ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. సెలబ్రిటీల గురించి నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలను ప్రచారం చేయకండి’ అని ఖుష్భూ విజ్ఞప్తి చేశారు.

కాగా, విశాల్‌, ఖుష్భూ మధ్య మంచి స్నేహబంధం ఉంది. కలిసి సినిమాలు చేయకపోయినా.. చాలా క్లోజ్‌గా ఉంటారు. మదగజరాజు సినిమాకు ఖుష్భూ భర్త సుందర్.సి దర్శకత్వం వహించారు. విశాల్‌తో తనకున్న అనుబంధం గురించి ఖుష్భూ మాట్లాడుతూ.. ‘మేమిద్దరం కలిసి సినిమాలు చేయలేదు. కానీ మొదటగా ఇద్దరం కలిసి ఓకే పార్టీలో పని చేశాం. ఆ కారణంగానే మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. విశాల్‌ నటించిన సినిమాల్లో కొన్ని నాకు చాలా ఇష్టం. మంచి టాలెంట్‌ ఉన్న నటుడు ఆయన. సినిమా కోసం చాలా కష్టపడతాడు’ అని ఖష్భూ చెప్పుకొచ్చింది.

12 ఏళ్ల తర్వాత రిలీజ్‌
విశాల్‌ హీరోగా సుందర్‌.సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ‘మదగజరాజ’(Madha Gaja Raja). 2013లో ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. పలు కారణాల వల్ల వాయిదా పడి దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యాక్షన్‌ కామెడీగా రూపొందిన ఈ మూవీలో అంజలి, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ హీరోయిన్లుగా నటించారు. ఆర్య, సదా అతిథి పాత్రల్లో సందడి చేయనున్నారు. ఈ సినిమా కోసం విశాల్‌ ఎయిట్‌ ప్యాక్‌ చేశాడట. 

షూటింగ్‌ ఆసల్యం అయినా కూడా మరో సినిమా చేయకుండా.. ఈ మూవీ కోసం కష్టపడ్డాడని ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్‌ సుందర్‌ చెప్పారు.  అంతేకాదు విశాల్‌ తనకు సొంత తమ్ముడి లాంటి వాడని చెప్పాడు. మొదట్లో విశాల్‌ని అపార్థం చేసుకున్నానని, అతనితో పరిచయం ఏర్పడిన తర్వాత అతను ఎంత మంచి వాడనే విషయం తెలిసిందన్నాడు. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలతో పని చేసినప్పటికీ.. కార్తిక్‌ తర్వాత విశాల్‌తోనే తను బాగా క్లోజ్‌ అయ్యానని చెప్పారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)