Breaking News

పిచ్చి పీక్స్.. 'ఖలేజా' రీ రిలీజ్‌లో పాముతో వీరంగం!

Published on Fri, 05/30/2025 - 16:11

గత కొన్నాళ్లుగా టాలీవుడ్‌లో వింత పరిస్థితి. కొత్త సినిమాల కంటే రీ రిలీజ్‌ల హడావుడి ఎక్కువైపోయింది. స్టార్ హీరోల మూవీస్ అయితే అభిమానులు, సదరు చిత్రాల్లో సీన్లని రీ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా 'ఖలేజా' రీ రిలీజ్ సందర్భంగానూ అంతకు మించి అనేలా ఓ అభిమాని రచ్చ చేశాడు. ఏకంగా థియేటర్లలోకి పాము తీసుకొచ్చి హల్‌చల్ చేశాడు.

(ఇదీ చదవండి: నటి స్నానం చేసిన నీటితో సబ్బు.. రేటు ఎంతంటే?)

తెలుగు రాష్ట్రాల్లో తాజాగా మహేశ్ బాబు 'ఖలేజా'ని రీ రిలీజ్ చేశారు. ఈ మూవీలో సీన్లకు తగ్గట్లు కొందరు ఆస్పత్రి డ్రస్ వేసుకుని వెళ్లగా, మరికొందరు కుండీతో మొక్కని తీసుకెళ్లారు. విజయవాడలో ఓ అభిమాని మాత్రం థియేటర్లలోకి పాముని తీసుకెళ్లాడు. సినిమా ప్రారంభంలో మహేశ్ బాబు పాముని పట్టుకుని.. విలన్లకి పైకి విసురుతాడు. ఇప్పుడు అభిమాని కూడా.. స్క్రీన్ దగ్గర పాముతో కనిపించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

'గుంటూరు కారం' తర్వాత మహేశ్ ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. ఇది రావడానికి మరో మూడు నాలుగేళ్లు పట్టొచ్చు. అందుకే మహేశ్ ఫ్యాన్స్.. 'ఖలేజా' రీ రిలీజ్ సందర్భంగా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. రకరకాల సీన్లని రీ క్రియేట్ చేస్తూ నెట్టింట వైరల్ అయిపోతున్నారు. ఇకపోతే ఈ సినిమాకు తొలిరోజు భారీగానే వసూళ్లు వచ్చేలా కనిపిస్తున్నాయి.

(ఇదీ చదవండి: విష్ణుని రెచ్చగొట్టేలా మంచు మనోజ్ మరో పోస్ట్!)

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)