Breaking News

కన్నడ సినిమాలు ఆడుతున్నాయా? చులకన చేసిన స్టార్‌ హీరో

Published on Thu, 08/14/2025 - 14:24

కేజీఎఫ్‌ సినిమా (KGF Movie)తో కన్నడ సినిమా పేరు మార్మోగిపోయింది. 2018లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లు రాబట్టింది. దీనికి సీక్వెల్‌గా తెరకెక్కిన కేజీఎఫ్‌ 2 ఏకంగా రూ.1250 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే 'అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు, జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు' అన్న చందంగా ఈ సినిమాను చాలామంది లైట్‌ తీసుకున్నారట!

ఓ పెద్ద హీరోను అడిగితే..
ఈ విషయాన్ని కేజీఎఫ్‌, కాంతార నిర్మాతల్లో ఒకరైన చలువె గౌడ (హోంబలే ఫిలింస్‌ సహ వ్యవస్థాపకుడు) వెల్లడించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మా కథల్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్నదే మా లక్ష్యం. ఉదాహరణకు కాంతార ద్వారా భూతకోల అనే ఆచారాన్ని ప్రపంచానికి తెలియజేశాం. కొన్నేళ్ల క్రితం కేజీఎఫ్‌ సినిమాలో ఓ పాత్ర కోసం మేము ఓ పెద్ద స్టార్‌ హీరోను సంప్రదించాం. ఆయనేమన్నారంటే.. కన్నడ సినిమాలు ఎక్కడ ఆడతాయి?అని హేళన చేశారు. 

ఇది కదా సక్సెస్‌ అంటే!
ఆ సమయంలో కర్ణాటక దాటితే కన్నడ చిత్రాల గురించి ఎవరికీ తెలియదన్నట్లుగా ఉండేది పరిస్థితి. కన్నడ ఇండస్ట్రీ అంటే డాక్టర్‌ రాజ్‌కుమార్‌.. అంతే తెలుసు. ఇప్పుడా పరిస్థితిలో మార్పు వచ్చింది. మమ్మల్ని హేళన చేసినవారే ఇప్పుడు అవకాశాలిమ్మని అడుగుతున్నారు. ఇది కదా సక్సెస్‌ అంటే! అని చెప్పుకొచ్చారు. అయితే ఆ స్టార్‌ హీరో ఎవరన్నది మాత్రం బయటపెట్టలేదు. హోంబలే ఫిలింస్‌ ప్రస్తుతం కాంతార చాప్టర్‌ 1 సినిమా రిలీజ్‌ కోసం ఎదురుచూస్తోంది. ఈ మూవీ అక్టోబర్‌ 1న విడుదల కానుంది. వచ్చే ఏడాది సలార్‌ 2 సెట్స్‌పైకి వెళ్లనుంది. అలాగే హృతిక్‌ రోషన్‌.. ఈ బ్యానర్‌లో ఓ హిందీ మూవీ చేయనున్నాడు.

చదవండి: ఆ హీరోయిన్‌ మగాడిలా ఉంటుందన్న మృణాల్‌.. కౌంటరిచ్చిన బిపాసా

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)