Breaking News

కేజీఎఫ్ మూవీ యశ్‌ కోసం కాదట.. నిర్మాణ సంస్థ ఏమందంటే?

Published on Wed, 08/13/2025 - 17:50

కేజీఎఫ్మూవీతో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న హీరో యశ్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేశాయి. కోలార్ గనుల నేపథ్యంలో వచ్చిన కేజీఎఫ్సిరీస్సినిమాలు కన్నడ స్టార్యశ్కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించాయి. భారీ బడ్జెట్సినిమాలను హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది.

అయితే ఇటీవల కేజీఎఫ్ సినిమాకు మొదట అనుకున్నది యశ్ కాదంటూ కథనాలు వెలువడ్డాయి. దీంతో వార్తలపై నిర్మాణ సంస్థ స్పందించింది. ఇవన్నీ తప్పుడు కథనాలు అంటూ కొట్టిపారేసింది. కథను యశ్కోసమే సిద్ధం చేశామని తెలిపింది. యశ్తో తమకు దీర్ఘకాలం భాగస్వామ్యం ఉందని.. తాను మా కుటుంబంలో ఓ భాగమని పంచుకున్నారు. అతను ఎల్లప్పుడూ మా రాకీ భాయ్‌గానే గుర్తుంటాడని హోంబలే ఫిల్మ్స్ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.

కేజీఎఫ్ సినిమాలతోనే కన్నడ సినిమా పాన్ ఇండియాలో గుర్తింపు వచ్చిందని హోంబాలే ఫిల్మ్స్ సహ వ్యవస్థాపకుడు చలువే గౌడ గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడారు. కేజీఎఫ్ తర్వాత కాంతార లాంటి చిత్రాల విజయం కన్నడ సినిమా ఇమేజ్ను పెంచిందన్నారు. కర్ణాటక వెలుపల కన్నడ చిత్రాల గురించి చాలా మందికి తెలియదని.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు.

కాగా.. 2018లో విడుదలైన కేజీఎఫ్: చాప్టర్ 1 అత్యధిక వసూళ్లు చేసిన కన్నడ చిత్రంగా నిలిచింది. 2022లో విడుదలైన కేజీఎఫ్- 2 మరిన్ని రికార్డులను బద్దలు కొట్టింది. బాక్సాఫీస్ వద్ద రూ.1,000 కోట్లకు పైగా వసూలు చేసిన మొదటి కన్నడ చిత్రంగా నిలిచింది.

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)