Breaking News

కమల్‌ హాసన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్.. క్షమాపణలు చెప్పకపోతే!

Published on Thu, 05/29/2025 - 18:39

కమల్ హాసన్‌ చేసిన కామెంట్స్‌పై వివాదం మరింత ముదురుతోంది. ఆయన క్షమాపణలు చెప్పేది లేదని స్పష్టం చేయడంపై కన్నడ సినీ పరిశ్రమ ఆగ్రహం వ్యక్తం చేసింది. కమల్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పకపోతే థగ్ లైఫ్‌ మూవీ కర్ణాటకలో విడుదల కానివ్వని స్పష్టం చేశారు. ఇప్పటికైనా కమల్ హాసన్ సారీ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేనిపక్షంలో థగ్‌ లైఫ్‌ రిలీజ్‌ను కన్నడలో అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. ఇప్పటికే పలు కన్నడ సంఘాలు కమల్ హాసన్ కామెంట్స్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. కమల్ సినిమాను కర్ణాటకలో పూర్తిగా నిషేధించాలని కోరుతున్నాయి.

కమల్‌ హసన్‌ కామెంట్స్‌పై కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఘాటుగా స్పందించింది. ఈనెల 30లోగా ఆయన క్షమాపణలు చెప్పకపోతే థగ్‌ లైఫ్‌ మూవీని విడుదల కానివ్వమని కేఎఫ్‌సీసీ స్పష్టం చేసింది.  కమల్‌ హాసన్‌పై తమకు ఎలాంటి సానుభూతి లేదని.. కన్నడ సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించింది. మరోవైపు రేపటిలోగా కమల్‌ హాసన్‌ బహిరంగ క్షమాపణ చెప్పకుంటే.. థగ్‌ లైఫ్‌ సినిమాను విడుదల కానివ్వమని కేఎఫ్‌సీసీ మాజీ అధ్యక్షుడు గోవిందు వార్నింగ్ ఇచ్చారు.

కర్ణాటక కేఎఫ్‌సీసీ అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ..' కమల్‌ హాసన్ థగ్‌ లైఫ్‌ సినిమాను నిషేధించాలని కన్నడ సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి. అందుకే ఈ విషయంపై ఇప్పటికే సమావేశమై చర్చించాం. కమల్ తప్పు చేశారని నిర్ధారించాం. తన వ్యాఖ్యలపై కమల్ తప్పనిసరిగా‌ క్షమాపణ చెప్పాల్సిందే. ఇదే అంశంపై ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాం' అని అన్నారు. ఈ విషయాన్ని కేఎఫ్‌సీసీ మాజీ అధ్యక్షుడు గోవిందు వెల్లడించారు. 

కాగా.. ఇటీవల ఆయన నటించిన థగ్‌ లైఫ్‌ సినిమా ఈవెంట్‌లో కమల్ హాసన్‌ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని ఆయన అన్నారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్‌పై కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై కన్నడ సంఘాలు పెద్దఎత్తున నిరసన చేపట్టాయి. అయితే ఈ విషయంలో తాను క్షమాపణ చెప్పేది లేదని కమల్ హాసన్‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)