Breaking News

హీరోయిన్‌గా అవకాశాలు రాక ఐటం సాంగ్‌? కేతిక ఏమందంటే?

Published on Sun, 04/06/2025 - 11:57

‘అది దా సర్‌ ప్రైజ్‌’ అనే పాటలోని హుక్‌ స్టెప్‌తో ఎంతోమందికి నచ్చిన కేతికా శర్మ (Ketika Sharma), అంతే ఎక్కువగా ట్రోలింగ్‌ను కూడా ఎదుర్కొంది. ఎన్ని తిట్టినా, ఎంత పొగిడినా తన పని తాను చూసుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్న కేతికా చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం...

  • కొరియోగ్రాఫర్‌ డ్యాన్స్‌ మూవ్‌మెంట్స్‌ చెప్పినప్పుడు లోతుగా ఆలోచించను. వాళ్ళు చెప్పినవి చెప్పినట్టుగా సమయానికి ఎలా చేయగలను అనే దాని మీదే నా దృష్టి ఉంటుంది. హీరోయిన్‌గా అవకాశాలు రాక ఐటమ్‌ సాంగ్‌ చేయలేదు. ఈ మధ్య కాలంలో ఒక్క ఐటమ్‌ సాంగ్‌ దేశ వ్యాప్తంగా పాపులారిటీ తెచ్చిపెడుతోంది.

  • లక్నోలో స్కూలింగ్‌ చేసి, ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ వరకు చదివాను. పదహారేళ్ల వయసులోనే మోడలింగ్‌లోకి వచ్చాను. ‘థగ్స్‌’ అనే మ్యూజిక్‌ ఆల్బమ్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను.

  • అమ్మనాన్న ఇద్దరూ డాక్టర్లు. మోడలింగ్‌కి అభ్యంతరం చెప్పలేదు. కానీ, హీరోయిన్‌ అవుతానంటే మాత్రం ఒకటికి వందసార్లు ఆలోచించారు. ఏడాది టైమ్‌ ఇచ్చారు. అదృష్టం కొద్దీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు రావడంతో వాళ్లు మరో మాట మాట్లాడలేదు.

  • సోషల్‌ మీడియాలో ఎన్ని డబ్‌ స్మాష్‌ వీడియోలు చేశానో లెక్కే లేదు. ఆ వీడియోలు చూసే దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ‘రొమాంటిక్‌’ సినిమాలో హీరోయిన్‌గా నన్ను సెలెక్ట్‌ చేశారు. ఆ సినిమాతో స్టార్‌ హీరోయిన్‌ అయిపోతానని అనుకోలేదు. కాని, సినిమా ఫ్లాప్‌ అవుతుందని ఊహించలేదు. కొన్ని రోజులు మూడౌట్‌ అయ్యాను.

  • జీవితంలో మరిచిపోలేని సందర్భం అంటే, ‘రొమాంటిక్‌’ సినిమా లాస్ట్‌ డే షూటింగ్‌. అదే రోజు నాగశౌర్య హీరోగా ‘లక్ష్య’ సినిమా ఆఫర్‌ వచ్చింది. మొదటి సినిమా విడుదల కాకుండానే, రెండో సినిమా అవకాశం రావడం చాలా సంతోషంగా అనిపించింది.

  • ఇద్దరు స్టార్‌ బ్రదర్స్‌తో కలిసి నటించడం ఒక థ్రిల్లింగ్‌ ఎక్స్‌ పీరియన్స్‌. ‘బ్రో’లో సాయి ధరమ్‌ తేజతో, ‘రంగ రంగ వైభవంగా’లో అతని తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌తో కలిసి నటించినప్పుడు చాలా ఎంజాయ్‌ చేశాను, థ్రిల్‌గానూ ఫీలయ్యాను.

    చదవండి: అభినయ, సన్నీల పెళ్లి ఎప్పుడంటే..?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)