Breaking News

ఇన్నాళ్లకు ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ద కేరళ స్టోరీ'.. రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Tue, 02/06/2024 - 17:02

ఎట్టకేలకు 'ద కేరళ స్టోరీ' సినిమా ఓటీటీ రిలీజ్‌కి రెడీ అయిపోయింది. గతేడాది వేసవిలో థియేటర్లలోకి వచ్చినప్పుడు పలు వివాదాల్లో చిక్కుకుంది. ఈ క్రమంలోనే ఓటీటీ రిలీజ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. అప్పుడు ఇప్పుడని అన్నారు. కానీ చివరకు ఇప్పుడు అధికారికంగా ఓటీటీ పార్ట్‌నర్, స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు.

తెలుగు ప్రేక్షకులకు తెలిసిన అదాశర్మ.. 'ద కేరళ స్టోరీ' మూవీలో ప్రధాన పాత్ర పోషించింది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. సన్‍షైన్ పిక్చర్స్ పతాకంపై విపుల్ అమృత్‍లాల్ షా నిర్మించారు. థియేటర్ రిలీజ్‌కి ముందే డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న జీ5.. కాంట్రవర్సీ వల్లో ఏమో గానీ స్ట్రీమింగ్ తేదీ లాంటివి ఏం చెప్పకుండా వచ్చింది.

(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ పెంచేసిన రష్మిక.. తెలుగులో ఈమెనే టాప్?)

ఫైనల్ ఇప్పుడు ముహూర్తం కుదిరినట్లు ఉంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 16 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుందని అధికారికంగా ట్వీట్ పెట్టి మరీ ప్రకటించింది. దీంతో మూవీ లవర్స్ ఎగ్జైట్ అయిపోతున్నారు. నెక్స్ట్ వీకెండ్‌లో పక్కా చూసేయాలని ప్లాన్ వేసుకుంటున్నారు.

'ద కేరళ స్టోరీ' సినిమా కథ విషయానికొస్తే.. ముగ్గురు అమ్మాయిలు ప్రధానంగా ఉంటుంది. ఇందులో షాలినీ (అదా శర్మ) కథ మెయిన్ పార్ట్. ఈ అమ్మాయిలు ముగ్గురిని ప్రేమ పేరుతో మభ్యపెట్టి వేసుకొని ఇస్లాం మతంలోకి మార్చి విదేశాలకు తీసుకెళ్లి ఉగ్రవాదులుగా మార్చాలని కొందరు ప్రయత్నిస్తారు. షాలినీని అఫ్గానిస్థాన్‍కు చెందిన ఓ వ్యక్తి.. అలానే పెళ్లి చేసుకొని తీసుకెళతాడు. చివరకు షాలినీ పరిస్థితి ఏమైంది? తప్పించుకోగలిగిందా? అనేదే ఈ మూవీ.

(ఇదీ చదవండి: అందుకే ఇన్నేళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చాం: ఉపాసన)

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)