Breaking News

'ద కేరళ స్టోరీ' సీక్వెల్‌.. సైలెంట్‌గా షూటింగ్‌ పూర్తి!

Published on Fri, 01/02/2026 - 09:17

'ద కేరళ స్టోరీ' సినిమా విడుదల సమయంలో దేశవ్యాప్తంగా ఎన్నో వివాదాలు తెరపైకి వచ్చాయి. అయితే, బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్‌ రాబట్టింది. ఆపై ది కేరళ స్టోరీ సినిమాకు రెండు విభాగాల్లో (ఉత్తమ దర్శకుడు, సినిమాటోగ్రఫీ) అవార్డులు రావడంతో కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌  విజయన్‌ తీవ్రంగా తప్పుబట్టారు. మతపరమైన విభేదాలను రెచ్చగొట్టేలా, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా తీసిన సినిమాకు ఇలాంటి గౌరవాన్ని కల్పించడం అనేది దారుణమన్నారు. అయితే, ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్‌ రానున్నట్లు తెలుస్తోంది.

కేరళలో కొన్నేళ్లుగా మహిళలు లవ్ జిహాద్ ఉచ్చులో చిక్కుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వారు  అదృశ్యమైనట్లు వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తంతో దర్శకుడు సుదీప్తో సేన్‌ 'ద కేరళ స్టోరీ'ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి  సీక్వెల్‌గా ‘ది కేరళ స్టోరీ 2’ రాబోతున్నట్లు  సమాచారం ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే చిత్రీకరణ కూడా పూర్తయిందట. సీక్వెల్‌లో  భయంకరమైన చీకటి కథను ప్రపంచానికి చూపించనున్నారని ప్రచారం ఉంది. పార్ట్‌-2 షూటింగ్‌ పనులను  కఠినమైన భద్రతతో నిర్మాత  విపుల్‌ అమృత్‌లాల్‌ షా పూర్తి చేశారట. ఫిబ్రవరి 27న పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల చేయాలని కూడా ఫిక్స్‌ చేశారట. ఈ విషయాన్ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

Videos

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Bhogapuram: అభివృద్ధి సంకల్పం ఆ ఘనత జగన్ దే

చంద్రబాబు నివాసమున్న జిల్లాలోనే మహిళలపై పెరిగిన 11 శాతం నేరాలు

ఇంజనీరింగ్ నిపుణులే షాక్ అయ్యేలా అమరావతిలో భారీ దోపిడీ

AP: సైబర్ దొంగలు కోటి 23 లక్షలు కొట్టేశారు

Perni Nani: చిరంజీవి పెట్టిన బిక్ష

నెల్లూరు జిల్లా ఉదయగిరి MLA కాకర్లపై TDP మహిళా నేత సంచలన వ్యాఖ్యలు

Photos

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)