Breaking News

'ది కేరళ స్టోరీ' ప్రభంజనం.. ఆలియా భట్‌ సినిమా రికార్డ్ బ్రేక్!

Published on Tue, 05/16/2023 - 10:56

ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. సుదీప్తోసేన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఊహించని వసూళ్లు రాబడుతూ అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలకు ముందు కొన్ని వివాదాలు చుట్టిముట్టినా అవేవీ సినిమాపై పెద్దగా ప్రభావితం చూపలేకపోయాయి.  విపుల్‌ షా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా మే 5న విడుదలైంది. రిలీజ్‌ అయిన పది రోజుల్లోనే దాదాపుగా రూ.136 కోట్లు రాబట్టింది. దీంతో బాలీవుడ్‌లో ఆదా శర్మ టాప్ ప్లేస్‌ దక్కించుకుంది.

(ఇది చదవండి: ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్, హీరోయిన్ ఆదా శర్మకు రోడ్డు ప్రమాదం)

అంతకుముందు అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన గంగుభాయి కతియావాడి పది రోజుల్లో రూ.129.1 కోట్లు వసూళ్లు సాధించింది. తాజాగా ది కేరళ స్టోరీ చిత్రం ఈ రికార్డును అధిగమించింది. ఈ రికార్డుతో బాలీవుడ్‌ హీరోయిన్లలో ఆదా శర్మ టాప్‌లో నిలిచింది. తాజాగా ఈ చిత్ర విజయంపై నటి ఆదా శర్మ స్పందించింది. ఈ మూవీ ఇంత పెద్ద విజయం సాధిస్తుందని తాను ఊహించలేదని తెలిపింది. ఈ విజయానికి కారణం అభిమానులేనని చెప్పుకొచ్చింది. 

ఆదా శర్మ మాట్లాడుతూ.. 'నేను ఇంత ఘనవిజయం సాధిస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఇది నా చేతిలో ఉందో లేదో నాకు తెలియదు. ఏది ఏమైనప్పటికీ నేను చేస్తున్న పనిని కొనసాగిస్తాను. ఇలాంటి సినిమా తీస్తానని నేనెప్పుడూ ప్లానింగ్ చేయలేదు. ఏది జరగాలనుకుంటే అది జరుగుతుంది. అలాంటి అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు. మిమ్మల్ని ఎవరైనా గట్టిగా నమ్మితేనే ఇలాంటి పాత్ర చేసే అవకాశం వస్తుంది.' అని అన్నారు. 

ది కేరళ స్టోరీ ఆదివారం ఒక్కరోజే రూ.23 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సినిమా విడుదలైన మొదటి వారంలో రూ.81.14 కోట్లు రాగా.. రెండో వారాంతంలో రూ.55.60 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో ఆదా శర్మతో పాటు యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించారు. కొంతమంది మహిళలను బలవంతంగా మతమార్పిడి చేసి ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో రిక్రూట్ చేయబడ్డారన్న కథాంశంగా తెరకెక్కించారు.

(ఇది చదవండి: స్కూల్ రోజుల్లోనే ప్రేమ.. లవ్‌ లెటర్‌ కూడా రాశా: హీరోయిన్) 

ఇందులో కేరళలో తప్పిపోయిన నలుగురు అమ్మాయిలు ఉగ్రసంస్థ ఐఎస్ఐలో చేరి శిక్షణ పొంది పొంది తమ మాతృభూమిపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టిన్నట్లు చూపించడంతో వివాదాలకు దారి తీసింది. ఈ సినిమాను కేరళ ప్రభుత్వం, కాంగ్రెస్‌తో సహా పలువిపక్షాలు భారీ ఎత్తున వ్యతిరేకిస్తున్నాయి. ఈ చిత్రంలో కేరళ రాష్ట్రాన్ని, అప్పటి ప్రభుత్వాన్ని కించపరిచేలా రూపొందించారని మండిపడుతున్నాయి. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)