Breaking News

బిర్యానీ పార్టీకి పిలిస్తే మంచివాళ్లా?.. హీరోయిన్‌పై నెటిజన్ ట్రోల్స్!

Published on Tue, 03/26/2024 - 16:49

బాలీవుడ్ భామ ఆదా శర్మ నటించిన వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ' సంచలన విజయం సాధించింది. కేరళలోని అమ్మాయిలను మతం పేరుతో విదేశాలకు తరలించారనే నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు 9 నెలల తర్వాత ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ ఏడాది బస్తర్ సినిమాతో మార్చి 15న ప్రేక్షకులను పలకరించింది. గతంలో బస్తర్‌లో జరిగిన మావోయిస్టుల దాడి ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

అయితే తాజాగా ఆదా శర్మ ముంబైలో జరిగిన ఓ ఇఫ్తార్‌ విందుకు హాజరైంది. ప్రముఖ రాజకీయ నాయకుడు బాబా సిద్ధిక్ నిర్వహించిన ఇఫ్తార్ పార్టీలో మెరిసింది. ఈ విందుకు సల్మాన్ ఖాన్, ఇమ్రాన్ హష్మీ, మునావర్ ఫరూఖీ, ప్రీతి జింటా, ప్రియాంక చాహర్ చౌదరి, షెహనాజ్ గిల్ లాంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు. ది కేరళ స్టోరీ సినిమా తర్వాత ఆదాశర్మ ఇఫ్తార్‌ విందుకు హాజరు కావడంపై ఓ నెటిజన్ ప్రశ్నించారు. ‘ఎంత మోసం.. ముస్లింలపై ద్వేషపూరిత సినిమాలు తీస్తారు.. ఇప్పుడేమో బిర్యానీ కోసం ఆహ్వానించగానే మంచివాళ్లు అయిపోయారా?’  అంటూ ఆదా శర్మ పార్టీలో ఉన్న వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై ది కేరళ స్టోరీ నటి స్పందించింది. 

దీనిపై అదా శర్మ స్పందిస్తూ.. 'అప్పుడైనా..ఇప్పుడైనా  ఉగ్రవాదులు అంటే విలన్లు. అంతేకాని ముస్లింలు కాదు' అంటూ రిప్లై ఇచ్చింది. కాగా.. కేరళలో అమ్మాయిలను బలవంతంగా మతమార్పిడి చేసి విదేశాలకు తరలించారనే నేపథ్యంలోనే ది కేరళ స్టోరీని రూపొందించారు.  అయితే గతంలో తాము ఈ సినిమాను ఏ మతానికి వ్యతిరేకంగా నిర్మించలేదని తెలిపారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా ఉన్నవారంతా మా పోరాటంలో భాగస్వాములు కావాలని కోరారు. కాగా.. ఈ చిత్రంలో యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నానీ ప్రధాన పాత్రల్లో నటించారు.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు