Breaking News

ఏనుగు దంతాల కేసులో మోహన్ లాల్‌కు ఎదురుదెబ్బ

Published on Sat, 10/25/2025 - 10:22

మలయాళ నటుడు మోహన్ లాల్‌కు కేరళ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన ఇంట్లో రెండు జతల ఏనుగు దంతాలు (Ivory Tusks) ఉన్న విషయం తెలిసిందే. వాటిని రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోనే ఇంట్లో ఉంచానని గతంలో  న్యాయస్థానానికి ఆయన తెలిపారు. అందుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన అనుమతి పత్రాలను కూడా  చూపారు. ఏనుగు దంతాల విషయంలో మోహన్‌ లాల్‌  చట్టాన్ని ఉల్లంఘించలేదని, ఆయన ఇంట్లో ఉన్నవి చనిపోయిన ఏనుగు దంతాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కోర్టుకు తెలిపింది. అయితే, తాజాగా ఈ కేసులో కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మోహన్‌లాల్‌కు ఇచ్చిన యాజమాన్య ధ్రువీకరణ పత్రాలను న్యాయస్థానం  రద్దు చేసింది. ఏనుగు దంతాల విషయంలో ఇలా అనుమతి ఇవ్వడం చట్టవిరుద్ధం.. మీకు నచ్చినట్లు అనుమతి ఎలా ఇస్తారని కేరళ ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది.

15 ఏళ్ల నుంచి ఏనుగు దంతాల కేసు మోహన్‌లాల్‌ను వెంటాడుతున్న సంగతి తెలిసిందే. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ నటుడు మోహన్‌లాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది. 2012లో ఐటీ శాఖ అధికారులు మోహన్ లాల్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో రెండు జతల ఏనుగు దంతాలను గుర్తించారు. దాంతో వన్యప్రాణుల చట్టం ప్రకారం మోహన్ లాల్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్రమంగా ఏనుగు దంతాలను ఇంట్లో అలంకరణకు పెట్టుకొని చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. 

అయితే తాను చట్టప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు తీసుకున్న తర్వాతే ఏనుగు దంతాలను ఇంట్లో పెట్టుకున్నట్లు మోహన్‌ లాల్‌ చెప్పడంతో కోర్టుకు వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో 2016 జనవరి, ఏప్రిల్‌లో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ద్వారా మోహన్‌లాల్‌కు జారీ చేసిన యాజమాన్య ధృవీకరణ పత్రాలను వాటికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను కోర్టు తాజాగా కొట్టివేసింది.

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)