Breaking News

రెండు సంప్రదాయాలను గౌరవిస్తూ కీర్తి సురేష్‌ పెళ్లి

Published on Fri, 12/06/2024 - 12:32

సినీ తారల ప్రేమ, పెళ్లి అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం ఇలాంటి సీజనే నడుస్తోందని చెప్పవచ్చు. ఇటీవల నటుడు నాగచైతన్య, శోభిత వివాహం సాంప్రదాయబద్ధంగా జరిగిన విషయం తెలిసిందే. మరుపక్క నటి సమంత బాలీవుడ్‌కు చెందిన ఓ నటుడి ప్రేమలో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇకపోతే కురక్రారుల డ్రీమ్‌ గర్ల్‌ కీర్తి సురేష్‌ కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నారు. 

ప్రస్తుతం ఆమె నటిస్తున్న హిందీ చిత్రం బేబీ జాన్‌తో ఈ అమ్మడు పాన్‌ ఇండియా కథానాయకిగా పేరు తెచ్చుకున్నారు. ఇలా కథానాయకిగా ఉన్నత స్థాయిలో రాణిస్తున్న సమయంలోనే కీర్తి సురేష్‌ పెళ్లికి సిద్ధమవడం చాలామందిని ఆసక్తికి గురిచేసింది. 15 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న తన పాఠశాల స్నేహితుడు ఆంటోనితో ఏడడుగులు నడవడానికి కీర్తి సురేష్‌ సిద్ధమవుతున్నారు. కాగా తను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి క్రిస్టియన్‌ మతానికి చెందినవాడు కావడంతో నటి కీర్తి సురేష్‌ కూడా మతం మారడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. 

అయితే అది నిజం కాదంటూ తమ ప్రేమ, పెళ్లికి మతం సమస్య కాదని ఈ క్రేజీ జంట నిరూపించుకున్నారు. ఆ విధంగా ఇరు కుటుంబాల సమ్మతితో  రెండు మతాలను సంప్రదాయాలనూ గౌరవించే విధంగా ఆంటోనీ, కీర్తి సురేష్‌ వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. వీరి పెళ్లి ఈనెల 12న గోవాలో జరగనుంది. అక్కడ 12వ తేదీ ఉదయం హిందూ మత సంప్రదాయ ప్రకారం, అదేరోజు సాయంత్రం చర్చిలో క్రిస్టియన్‌ మత సాంప్రదాయ ప్రకారం కీర్తి సురేష్, ఆంటోనీ పెళ్లి రెండు సార్లు జరగనుందని తెలిసింది. వీరి వివాహ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం.   
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)