Breaking News

చిన్న మిస్టేక్‌ వచ్చినా ఒప్పుకోని కీర్తి.. బరాత్‌ డ్యాన్స్‌ కోసం 25 టేక్స్‌!

Published on Mon, 04/10/2023 - 10:26

పెళ్లంటే హల్దీ, మెహందీ, సంగీత్‌.. ఇలా నానా హంగామా ఉంటుంది. అయితే ఈ కార్యక్రమాలన్నీ ఉన్నా లేకపోయినా పెళ్లి వేడుకలో కచ్చితంగా ఉండేది బరాత్‌. ఇక్కడ క్లాస్‌ పాటలకు పర్ఫామ్‌ చేయడం కాదు మాస్‌ మ్యూజిక్‌కు స్టెప్పులేయడమే ఉంటుంది. అప్పటిదాకా ఎమోషన్‌లో ఉన్న వధూవరుల బంధువులు, కుటుంబసభ్యులు కూడా బరాత్‌ ప్రారంభమవగానే ఒక్కసారిగా అలర్ట్‌ అవుతారు. పెళ్లికొడుక్కి డ్యాన్స్‌ వచ్చినా రాకపోయినా ఎలాగోలా గుంపులోకి లాక్కొచ్చి నాలుగు స్టెప్పులేయిస్తారు. కానీ ఈ మధ్య పెళ్లికూతుళ్లను ఎవరూ పిలవకపోయినా సరే వాళ్లే డైరెక్ట్‌గా బరాత్‌లో ఎంటరై తీన్మార్‌ డ్యాన్స్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

ఇలాంటి తీన్మార్‌ డ్యాన్స్‌ దసరా సినిమాలో కీర్తి సురేశ్‌ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను రిలీజ్‌ చేసి వారం రోజులవుతున్నా ఇప్పటికీ ట్రెండ్‌ అవుతూనే ఉంది. తాజాగా కీర్తి పాప మాస్‌ డ్యాన్స్‌ వెనక ఉన్న కష్టాన్ని వెల్లడించాడు డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల. ఈ డ్యాన్స్‌ బిట్‌ కోసం కీర్తి 25 టేకులు తీసుకుందని చెప్పాడు. చిన్న మిస్టేక్‌ వచ్చినా మళ్లీ మొదటి నుంచి చేస్తానని అదే ఎనర్జీతో డ్యాన్స్‌ చేసేదని పేర్కొన్నాడు. అన్నిసార్లు ఒకే బిట్‌ను, అదే జోష్‌తో చేసిందంటూ కీర్తి డెడికేషన్‌ ఏ లెవల్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక దసరా విషయానికి వస్తే ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు శ్రీకాంత్‌ ఓదెల. ధరణిగా నాని, వెన్నెలగా కీర్తి సురేశ్‌ నటించిన ఈ మూవీ మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించిన ఈ మూవీ వారం రోజుల్లోనే వంద కోట్లు రాబట్టింది. ఈ సంతోషంతో నిర్మాత చెరుకూరి సుధాకర్‌.. డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెలకు బీఎమ్‌డబ్ల్యూ కారు బహుమతిగా ఇచ్చాడు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)