Breaking News

కీర్తికి వింత అనుభవం.. దోస అని పిలవడంతో..

Published on Sat, 12/28/2024 - 15:45

బేబీ జాన్‌ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (Keerthy Suresh). ఈ సినిమా కోసం ఎంతో కష్టపడింది. పర్సనల్‌ లైఫ్‌ను పక్కనపెట్టేసి ప్రమోషన్స్‌లో మునిగిపోయింది. కానీ ఏం లాభం? బేబీ జాన్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సత్తా చూపించలేకపోయింది. మిక్స్‌డ్‌ టాక్‌ వస్తుండటంతో వసూళ్లు అందుకోవడం కష్టంగా మారింది.

కీర్తి దోస..
ఇకపోతే సినిమా కోసం తరచూ ముంబై వెళ్తోంది కీర్తి. ఈ క్రమంలో గురువారం రాత్రి అక్కడి ఫోటోగ్రాఫర్లు ఆమను కెమెరాల్లో బంధించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరు తనను కృతి అని పిలిచారు. దీంతో ఆమె.. నా పేరు కృతి కాదు కీర్తి అని చెప్పింది. ఇకపోతే సౌత్‌ ఇండియన్‌ యాక్టర్స్‌ను అక్కడి ఫోటోగ్రాఫర్లు దోస అని పిలుస్తుంటారు. అలా కొందరు దోస అని పిలవడంతో ఆమె అభ్యంతరం చెప్పింది. నా పేరు కీర్తి దోస కాదు కీర్తి సురేశ్‌. కానీ నాకు దోస అంటే చాలా ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

సినిమా
బేబీ జాన్‌ (Baby John Movie) విషయానికి వస్తే వరుణ్‌ ధావన్‌ హీరోగా నటించగా కీర్తితో పాటు వామిక గబ్బి హీరోయిన్‌గా యాక్ట్‌ చేసింది. జాకీ ష్రాఫ్‌ విలన్‌గా నటించాడు. ఈ చిత్రం డిసెంబర్‌ 25న విడుదలైంది. తేరీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించగా థమన్‌ సంగీతం అందించాడు.

 

 

చదవండి: బేబీ బంప్‌తో సమంత.. వైరల్‌ ఫోటోలపై ఫ్యాన్స్‌ ఫైర్‌

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)