Breaking News

వీధి పోకిరి చెంప చెళ్లు మనిపించా: కీర్తి సురేశ్‌

Published on Sat, 02/10/2024 - 07:32

తక్కువ కాలంలోనే హీరోయిన్‌గా అనూహ్య స్థాయికి చేరుకుంది కీర్తీ సురేశ్‌. మహానటి చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మలయాళం, తమిళం, తెలుగు భాషలను దాటి ఉత్తరాది ప్రేక్షకులను అలరించడానికి బాలీవుడ్‌ వరకు చేరుకుంది. ఇలా చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న కీర్తీ సురేశ్‌కు ధైర్యం కాస్త ఎక్కువేనట. సినీ రంగప్రవేశం చేయకముందే నిజ జీవితంలో తన మాస్‌ హీరోయిజాన్ని చూపించారట.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఒక పోకిరికి బుద్ధి చెప్పిన సంఘటన గురించి చెప్పారు. నటిగా పరిచయం కాని సమయంలో ఒక రోజు అర్ధరాత్రి తాను స్నేహితురాళ్లతో కలిసి వెళుతున్నానని, అప్పుడొక మందుబాబు వెనుకగా వచ్చి తనను రాసుకుంటూ వెళ్లాడని చెప్పారు. తనకు కోపం తన్నుకు రావడంతో అతన్ని పట్టుకుని చెంపలు పగలకొట్టినట్లు చెప్పారు. ఆ తరువాత ఆ మందుబాబు తనపై దాడి చేసి తలపై కొట్టాడని, దీంతో అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించినట్లు కీర్తి సురేశ్‌గుర్తు చేసుకున్నారు.

పోలీసులు అతన్ని ఆ రాత్రి అంతా జైలులోనే ఉంచి ఉదయం విడిచి పెట్టారని చెప్పారు. అయితే ఇది నమ్మశక్యంగా లేదంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఏదేమైనా కీర్తీ సురేశ్‌ తాజాగా జయంరవి చొక్కా కాలర్‌ పట్టుకుని ఈడ్చుకెళుతున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇది సైరన్‌ చిత్రంలో దృశ్యం అని గమనించవచ్చు. జయంరవి కథానాయకుడిగా నటించిన ఇందులో కీర్తీసురేశ్‌ పోలీస్‌ అధికారిగా నటించారు. ఈ చిత్రం కోసం ఈ బ్యూటీ 10 కిలోల బరువు పెరిగారట. సైరన్‌ చిత్రం ఈనెల 16న థియేటర్లలోకి రానుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)