Breaking News

సమంత సందేశం ధైర్యాన్ని ఇచ్చింది: కీర్తి సురేశ్‌

Published on Wed, 01/01/2025 - 08:51

స్టార్‌ హీరోయిన్‌ సమంతకు ‘మహానటి’ కీర్తి సురేశ్‌ థాంక్స్‌ చెప్పింది. ఆమె వల్లే తనకు ‘బేబీ జాన్‌’ అవకాశం వచ్చిందని, ఆమె ఇచ్చిన ధైర్యంతోనే సినిమాలో నటించానని చెప్పింది. కీర్తి సురేశ్‌ నటించిన తొలి హిందీ సినిమా ‘బేబీ జాన్‌’.వరుణ్ ధావన్‌ హీరోగా కాలీస్ దర్శకత్వంలో అట్లీ నిర్మించిన ఈ మూవీ క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్‌ టాక్‌ సంపాదించుకుంది.

 తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నటించే అవకాశం ఎలా వచ్చిందో చెప్పింది. తమిళ మూవీ ‘తెరి’ని హిందీలో రీమేక్‌ చేయాలని భావించగానే సమంత నా పేరు చెప్పారు. తమిళ్‌లో ఆమె పోషించిన పాత్రను నేను హిందీలో చేయడం ఆనందంగా ఉంది. సామ్‌ వల్లే నాకు హిందీ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. 

‘తెరి’లో సమంత నటన నాకెంతో ఇష్టం. ఆ పాత్రలో నేను నటించాలని చెప్పగానే భయపడ్డాను. కానీ సమంత నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. మేకర్స్‌ నా పేరు వెల్లడించగానే.. ‘నువ్వు తప్ప ఈ పాత్రలో మరెవ్వరు చేయలేరు’ అని సమంత తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టారు. ఆ సందేశం నాకు చాలా ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచింది. సమంత స్ఫూర్తితోనే ధైర్యంగా షూటింగ్‌ పూర్తి చేశాను. ఈ మూవీలో నటించనడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని కీర్తి సురేశ్‌ చెప్పుకొచ్చింది. కాగా, గతంలో కీర్తి, సమంత కలిసి ‘మహానటి’లో నటించారు. 

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు