Breaking News

కీర్తి సురేశ్‌ లేడీ ఒరియంటెడ్‌ ఫిలిం.. గ్లింప్స్‌ చూశారా?

Published on Thu, 12/21/2023 - 10:10

వరుస విజయాలతో మంచి హుషారులో ఉంది హీరోయిన్‌ కీర్తి సురేశ్‌. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఈ ఏడాది బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో బోలెడన్ని సినిమాలున్నాయి. అందులో ఒకటి సైరన్‌.. హీరో జయం రవితో జోడీ కట్టిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఆమె నటించిన మరో చిత్రం రఘుతాత. ఇది లేడీ ఓరియంటెడ్‌ కథా చిత్రం. దీన్ని ప్రముఖ కన్నడ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్‌ నిర్మించడం విశేషం. ఇది పిరియాడికల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రంగా తెరకెక్కుతోంది.

సుమన్‌కుమార్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోందని తాజాగా విడుదల చేసిన చిత్ర గ్లింప్స్‌ను చూస్తే తెలుస్తోంది. ఇంతకు ముందు తోపుడు బండ్లు, రిక్షాలలో చిత్రాలను ప్రచారం చేసేవారు. ఈ చిత్ర గ్లింప్స్‌లోనూ.. తోపుడు బండిపై కీర్తి సురేశ్‌ పోస్టర్‌ అంటించి ప్రచారం చేస్తున్నట్లు చూపించారు.

నటుడు ఎంఎస్‌.భాస్కర్‌, దేవదర్శిని, రవీంద్ర విజయ్‌, ఆనందసామి, రాజేశ్‌ బాలకృష్ణన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శాన్‌ సంగీతాన్ని, యామిని యజ్ఞమూర్తి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాతో కీర్తి సురేశ్‌ మరో హిట్‌ తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి!

చదవండి: పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్‌.. వారిద్దరిపై నమోదైన కేసు ఇదే

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)