Breaking News

ప్రభాస్‌ కల్కిలో ఆఫర్‌.. రిజెక్ట్‌ చేశా: కీర్తి సురేశ్

Published on Mon, 08/12/2024 - 13:02

దసరా బ్యూటీ కీర్తి సురేశ్‌ ప్రస్తుతం రఘుతాత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతేడాది దసరా మూవీతో సూపర్ హిట్ కొట్టిన కోలీవుడ్ భామ డిఫరెంట్‌ స్టోరీతో రాబోతోంది. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ నటిచిన కల్కి 2898 ఏడీ సినిమాలో బుజ్జికి వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసింగే. తాజా ఇంటర్వ్యూలో కల్కి సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇందులో నాగ్ అశ్విన్‌ తనకు ఓ రోల్‌ ఆఫర్‌ చేశారని తెలిపింది. కానీ దాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించింది.


కీర్తి సురేశ్ మాట్లాడుతూ..'కల్కి 2898 ఏడీ చిత్రంలో ఓ రోల్ కోసం డైరెక్టర్ నన్ను సంప్రదించారు. కానీ ఆ పాత్ర నేను చేయలేనని చెప్పా. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావాలనుందని మెసేజ్‌ చేశా. ఆ తర్వాత ఆయన కాల్‌ చేసి బుజ్జి రోల్‌కు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వాలని అడిగారు. నాకు మొదట అర్థం కాలేదు. షూట్‌లో నేను కూడా భాగం కావాల్సిన అవసరం లేదా? అని అడిగా. లేదు కేవలం వాయిస్‌ ఓవర్‌ ఇస్తే చాలు అన్నారు. దీంతో నేను వెంటనే ఓకే చెప్పా. వాయిస్‌ ఓవర్‌ విషయంలో నాగ్‌ అశ్విన్‌ నాకెంతో సాయం చేశారు' అని చెప్పుకొచ్చారు. 

అంతే కాకుండా కల్కి పార్ట్‌ -2 కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. అయితే తనకు కల్కిలో ఆఫర్‌ చేసిన పాత్ర ఏంటనేది మాత్రం వెల్లడించలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా.. కీర్తి ప్రధానపాత్రలో సుమన్‌కుమార్‌ తెరకెక్కించిన రఘు తాత ఆగస్టు 15న విడుదల కానుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)