Breaking News

డైరెక్ట్‌గా ఓటీటీకి కీర్తి సురేశ్‌ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published on Mon, 09/09/2024 - 17:25

హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం రఘుతాత. ఈ మూవీకి సుమన్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై నిర్మించారు. తమిళంలో తెరకెక్కించిన ఈ మూవీని తెలుగులోనూ థియేటర్లలో విడుదల చేయాలని భావించారు. కానీ అనివార్య కారణాలతో టాలీవుడ్‌లో విడుదల కాలేదు.

తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి తెలుగు ప్రేక్షకులకు డైరెక్ట్‌గా ఓటీటీలోనే రఘు తాత అందుబాటులోకి రానుంది. ఈ సినిమా హక్కులను జీ5 దక్కించుకోగా.. తెలుగు, త‌మిళం,మ‌ల‌యాళం, క‌న్న‌డ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ5 ట్విటర్ వేదికగా పంచుకుంది.

ఆగష్టు 15న తమిళంలో విడుదలైన ఈ చిత్రం కోలివుడ్‌ ప్రేక్షకులను మెప్పించింది. హిందీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి అనే విధానాన్ని వ్యతిరేకించడంతోపాటు మహిళలపై జరుగుతున్న పలు సంఘటనలతో ఫ్యామిలీ ఎంటర్‌టైయినర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో కీర్తి సురేశ్ హిందీకి వ్యతిరేకంగా పోరాడే మహిళ పాత్ర పోషించింది. మొదటి నుంచి హిందీ భాష‌ను వ్య‌తిరేకిస్తూ వ‌చ్చిన ఆమె ఫైనల్‌గా హిందీ ఎగ్జామ్ రాయాల‌ని ఎందుకు నిర్ణయం తీసుకుందో ఈ మూవీ చూస్తేనే తెలుస్తుంది.
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)