'మహానటి' తర్వాత ఎవరూ ఛాన్స్‌లు ఇవ్వలేదు: కీర్తి సురేష్‌

Published on Mon, 11/24/2025 - 11:55

‘మహానటి’ (Mahanati) సినిమాలో తాను నటించినందుకు చాలా ట్రోల్స్‌ ఎదుర్కొన్నట్లు కీర్తి సురేష్‌(Keerthy Suresh) కొద్దిరోజుల క్రితం చెప్పారు. అయితే, తాజాగా మరోసారి ఇదే సినిమా గురించి  ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కానీ, తాను వాటిని అధిగిమించానని ఆమె చెప్పింది. సావిత్రి పాత్రలో తాను నటించినందుకు ఎప్పటికీ గర్వపడుతున్నట్లు చెప్పారు. ఈ మూవీలో కీర్తి నటనకు గాను ఉత్తమ జాతీయ అవార్డ్‌ అందుకున్న విషయం తెలిసిందే.

కీర్తి సురేష్‌ చాలా రోజుల తర్వాత వాల్వర్ రీటా మూవీతో మళ్లీ తెరపైకి వచ్చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా మూవీ  ప్రమోషన్ కార్యక్రమాలలో ఆమె పాల్గొంటుంది. ఆందులో ఆమె ఇలా చెప్పింది. 'మహానటి సినిమా తర్వాత దాదాపు ఆరు నెలల పాటు నాకు సినిమా ఛాన్సులు రాలేదు. కనీసం ఒక్క ప్రాజెక్ట్‌ కూడా రాకపోవడంతో ఇంట్లోనే ఉండిపోయాను. పరిశ్రమ నుంచి ఎవరూ కూడా నాకు కథ చెప్పడానికి ముందుకు రాలేదు. అయితే, మహానటి సినిమా చేసి నేను తప్పు చేశానని అనుకోలేదు. కొత్త ప్రాజెక్ట్‌లు రాలేదని నిరాశపడలేదు. మహానటి విజయం తర్వాత నా కోసం ప్రత్యేకమైన పాత్రలను క్రియేట్‌ చేసే పనిలో దర్శకనిర్మాతలు ఉన్నారేమో అనిపించింది.' అని ఆమె పేర్కొంది. 

ఇండియన్‌ సినిమా చరిత్రలో ఎప్పిటికీ మహానటి సినిమా ఉండిపోతుంది. కానీ, అలాంటి సినిమాలో నటించిన కీర్తి సురేష్‌కు మాత్రం చాన్స్‌లు రాలేదని చెప్పడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మహానటి సినిమాను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించారు. 2018లో  విడుదలైన ఈ చిత్రం భారీ హిట్‌ అందుకుంది. 66వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు సినిమా, జాతీయ ఉత్తమ నటి (కీర్తి సురేష్), జాతీయ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌ వంటి విభాగాల్లో అవార్డ్స్‌ అందుకుంది.

Videos

మాజీమంత్రి విడదల రజిని మానవత్వం.. గాయపడిన బాధితులకు తక్షణ సాయం

వరదకు ఎదురీది.. ప్రాణం కాపాడిన యువకుడు

మా వెనుక శేఖర్ మాస్టర్.. సుమలత మాకు అవసరం లేదు, మాకు రఘు మాస్టర్ బెస్ట్

రేవెంత్ కు కొండా పంచ్ అదిరిపోయే పంచ్

అమెరికా పునాదులు కదిలిస్తాం?

డబ్బు కోసం స్నేహితుడినే కిడ్నాప్.. పట్టించిన వాట్సాప్ మెసేజ్

చంద్రబాబు చీప్ పబ్లిసిటీపై వైఎస్ జగన్ ఆగ్రహం

ఇచ్చి ఒక నెల కూడా కాలేదు లోకేష్ ని ఏకిపారేసిన శ్రీదేవి

నచ్చకపోతే వెళ్లిపోండి జపాన్ క్రికెట్ CEO బీసీసీఐకి షాక్

దొంగతనం ఒప్పుకోమంటూ..! పోలీసుల వేధింపులపై అర్చకుడి తల్లి కన్నీళ్లు

Photos

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)