ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..
Breaking News
'బేబీ జాన్' కోసం కీర్తి సురేశ్ గ్లామర్ డోస్.. పూర్తి సాంగ్ విడుదల
Published on Mon, 11/25/2024 - 13:12
వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జోడీగా నటించిన చిత్రం ‘బేబీ జాన్’. కాలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి తాజాగా గ్లామరస్ సాంగ్ విడుదలైంది. కోలీవుడ్‌లో సూపర్ హిట్ సినిమా 'తెరి'కి రీమేక్‌గా బేబీ జాన్ రానుంది. కీర్తీ సురేశ్, వామికా గబ్బి హీరోయిన్లుగా ఇందులో నటించారు. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్ యాపిల్ పతాకాలపై జ్యోతీ దేశ్‌పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 25న రిలీజ్ కానుంది.
బేబీ జాన్ నుంచి విడుదలైన తాజా సాంగ్‌లో కీర్తి సురేష్ కాస్త గ్లామర్ డోస్ పెంచింది. ఇప్పటి వరకు డీసెంట్ రోల్స్ చేస్తూ.. ఎక్కడా హద్దులు దాటకుండా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు వాటిని క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తను లిప్‌లాక్ సీన్లో కూడా నటించినట్లు సమాచారం. దీనంతటికి కారణం ఈ చిత్రంతో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడమేనని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.
Tags : 1