Breaking News

కీర్తి, కృతీ.. ఇద్దరిది ఒకే స్థితి… ఏమిటి ఈ పరిస్థితి?

Published on Sun, 07/02/2023 - 16:05

దక్షిణాదిన స్టార్‌ హీరోయిన్‌ల జాబితాలో కీర్తిసురేష్‌ ఉన్నారు. ఆమె ఒక పక్క గ్లామర్‌ పాత్రలు చేస్తూనే... మరోపక్క కథానాయిక ప్రాధాన్యమున్న కథలతోనూ మెరుస్తున్నారు. ఆమె గత సినిమాలు కాస్త నిరాశపర్చినా.. ప్రస్తుతం ఆమె చేతుల్లో చాలా వరకు తమిళ ప్రాజెక్టులే ఎక్కువున్నాయి. దీంతో అవకాశాలు వచ్చిన చోటుకే వెళ్లే ఆలోచనలో కీర్తి ఉందట. టాలీవుడ్‌లో స్కీన్‌ షో చేసినా అంతగా అవకాశాలు రాకపోవడంతో మద్రాస్‌ ఫ్లైట్‌ ఎక్కడమే బెటర్‌ అనుకుంటుందట. తమిళంలో ఆమె చేతిలో సుమారు నాలుగుకు పైగా చిత్రాలున్నాయి.

(ఇదీ చదవండి: Devara: ఎవరూ ఊహించని ట్విస్ట్‌ ఇవ్వనున్నారా?)

తెలుగులో మాత్రం చిరంజీవి భోళా శంకర్‌ చిత్రంలో మాత్రమే కనిపించనుంది. అది కూడా చెల్లెలు పాత్రలో.. కానీ నాగచైతన్య, చందు మొండేటి కాంబోలో రాబోతున్న సినిమాకు కోసం కీర్తి సురేష్‌ను తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారట. ఏదేమైనా ఎక్కడ అవకాశాలు పిలిస్తే అక్కడికి వెళ్లడంలో తప్పులేదని నెటిజన్స్‌ అంటున్నారు. 

మరోవైపు  'ఉప్పెన'తో నటిగా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే భారీ క్రేజ్‌ సంపాదించుకున్న నటి కృతీశెట్టి పరిస్థితి కూడా దాదాపు కీర్తి మాదిరే ఉంది. ఈమెకు చాలానే ఛాన్స్‌లు అయితే వచ్చాయి కానీ హిట్లు మాత్రం రాలేదు. వారియర్‌, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ వంటి చిత్రాలు వరుస డిజాస్టర్లు వచ్చాయి. దీంతో ఆమెకు టాలీవుడ్‌లో కొంత మేరకు అవకాశాలు తగ్గాయి. కానీ తమిళ, మలయాళంలో మాత్రం భారీగానే ఈ బ్యూటీకి ఆఫర్లు వస్తున్నాయి.

మలయాళంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ డ్రామా   'అజయంతే రాండమ్ మోషణం'లో కృతిశెట్టికి ఛాన్స్‌ దక్కింది. ఇందులో '2018' సినిమాతో సంచలనం రేపిన  టోవినో థామస్ హీరో. తమిళ్‌ నుంచి రెండు సినిమాలు ఈ అమ్మడు చేతిలో ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే ఈ ఇద్దరు భామలు  టాలీవుడ్‌కు గుడ్‌ బై చెప్పనున్నారా అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: వాళ్లు నన్ను అడ్వాంటేజ్‌గా తీసుకున్నారు.. పాయల్ సంచలన కామెంట్స్)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)