Breaking News

OTT: ‘రఘు తాత’ మూవీ రివ్యూ

Published on Sun, 09/29/2024 - 09:25

ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘రఘు తాత’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
ఈ భూమి పై జీవన ఉనికికి భాష అనేది ఆయువు. ప్రస్తుత ప్రపంచంలో 7000కు పైచిలుకు భాషలు ఉండగా వాటిలో 200 నుండి 300 వరకు అధికారికంగా గుర్తించబడ్డాయి. కానీ ఈ భాషల వల్ల కూడా కొన్ని ప్రాంతాల్లో పోరాటాలు జరిగాయి... జరుగుతున్నాయి కూడా. ఇటువంటి సున్నితమైన అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు సుమన్‌ కుమార్‌ ఇటీవల ‘రఘు తాత’ చిత్రాన్ని రూపొందించారు. 

(చదవండి: సత్యం సుందరం మూవీ రివ్యూ)

తీసుకున్న పాయింట్‌ సీరియస్‌ అయినా చక్కటి స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను అలరించారు దర్శకుడు. సినిమాలోని పాత్రధారులందరూ వారి వారి పాత్రలకు ప్రాణం పోశారనే చెప్పాలి. ఈ సినిమాలో నాయకురాలి పాత్రలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన కీర్తీ సురేష్‌ నటించారు. తన అద్భుతమైన నటనా ప్రతిభతో ఈ సినిమాలోని ప్రధాన పాత్ర అయిన కయల్‌విళి పాండియన్‌ పాత్రకు ప్రాణం పోశారు కీర్తీ సురేష్‌. మరో ప్రధాన పాత్ర అయిన రఘు తాత పాత్రలో యం.యస్‌. భాస్కర్‌ ఇమిడియారు. 

(చదవండి: ‘దేవర మూవీ రివ్యూ)

ఇక కథాంశానికొస్తే... కయల్‌విళి పాండియన్‌ మద్రాస్‌ సెంట్రల్‌ బ్యాంక్‌లో క్లర్కు ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఉద్యోగం చేసుకుంటూనే కా పాండియన్‌ అనే కలం పేరుతో రచనలు కూడా చేస్తుంటుంది. అంతేనా హిందీ భాష వద్దు, మన భాష ముద్దు అనే పేరుతో ఉద్యమాలు చేస్తూ సమాజంలో భాషాభివృద్ధికి చేస్తున్న పోరాటంలో కీలక పాత్ర వహిస్తుంది. కయల్‌విళికి ఓ తాత ఉంటాడు. ఆయనే రఘు తాత. కయల్‌ చేసే ఉద్యమమంతా రఘు తాత నుండి వచ్చిందే. 

అంతవరకు కథ బాగున్నా కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల తన బ్యాంక్‌ ప్రమోషన్‌ కోసం హిందీ పరీక్ష దొంగతనంగా రాయవలసి వస్తుంది. ఓ పక్క హిందీ ఉద్యమం చేస్తూ మరో పక్క హిందీ పరీక్ష రాయడం కయల్‌విళి పెళ్ళిలో అందరికీ తెలిసిపోతుంది. అసలు కయల్‌ హిందీ పరీక్ష ఎందుకు రాయాల్సి వచ్చింది ? రాసినది అందరికీ తెలిసిన తరువాత తన పెళ్ళిలో ఏం జరిగింది? ఇలాంటివన్నీ జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమ్‌ అవుతున్న ‘రఘు తాత’లోనే చూడాలి. కొసమెరుపేంటంటే... ఈ సినిమా మాతృక తమిళం, పోరాటం చేసింది హిందీ భాషపై, కానీ మనం మాత్రం మన తెలుగు భాషలో ఈ సినిమా చూడడం. ఎందుకంటే భాష ఏదైనా భావం ముఖ్యం కాబట్టి.
– ఇంటూరు హరికృష్ణ 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)