Breaking News

హిందూ సంప్రదాయ పద్ధతిలో కీర్తి సురేష్,ఆంటోనీల పెళ్లి

Published on Thu, 12/12/2024 - 14:40

హీరోయిన్ కీర్తి సురేష్ తన చిరకాల స్నేహితుడు ఆంటోనీ తాటిల్‌ను పెళ్లి చేసుకుంది. గోవా వేదికగా వారిద్దరూ మూడుముళ్ల బంధంతో ఏడడుగులు నడిచారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఇరుకుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కీర్తి మెడలో ఆంటోనీ మూడుముళ్ల వేయడంతో నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను  అభిమానులతో కొత్త దంపతులు పంచుకున్నారు.

గోవా వేదికగా జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొందిమంది సన్నిహితులు పాల్గొన్నారు. నూతన వధూవరులను వారందరూ ఆశీర్వదించారు. దీంతో అభిమానులు కూడా వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ ఏడాది దీపావళి రోజున ఆంటోనీ తాటిల్‌‌తో తన ప్రేమ విషయాన్ని కీర్తి సురేశ్ తెలియజేసింది. సౌత్‌లో బిజీ హీరోయిన్‌గా ఉన్న ఆమె కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.  బేబీ జాన్‌ మూవీతో ఆమె  బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఈ‌ మూవీ త్వరలోనే విడుదలకానుంది.

కీర్తి సురేష్‌ పెళ్లిలో పాల్గొన్న వారందరికీ  KA అని ముద్రించి ఉన్న హ్యాండ్‌ బ్యాండ్స్‌ ఇచ్చారట.. వాటిని ధరించిన వారికి మాత్రమే పెళ్లి వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించారట. ఆంటోనీతో ప్రేమ, వివాహం గురించి ఇటీవల కీర్తి ఇన్‌స్టా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీపావళి వేడుకల్లో భాగంగా ఆయనతో కలిసి దిగిన ఒక ఫొటో విడుదల చేసిన ఆమె.. దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనున్నట్లు తెలిపింది. ఆంటోనీ కుటుంబం వ్యాపార రంగంలో రానిస్తుంది. కొచ్చి, చెన్నైలలో వారికి వ్యాపారాలున్నాయి. స్కూల్‌ డేస్‌ నుంచి కలిసే ఉన్న  కీర్తి, ఆంటోనీ కాలేజీ రోజుల్లో ప్రేమలో పడ్డారట. ఇప్పుడు పెళ్లితో ఒక్కటిగా కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు.

గోవాలో ఘనంగా జరిగిన కీర్తిసురేష్ వివాహం

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)