Breaking News

ఎక్కడెక్కడో టచ్ చేశారు.. వస్తావా అంటే తెలియక సరే అన్నాను: కీర్తి భట్

Published on Sat, 04/27/2024 - 09:58

బిగ్ బాస్ షోతో చాలామంది పేరు తెచ్చుకున్నారు. అలా ఆరో సీజన్‌లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న సీరియల్ నటి కీర్తి భట్. పలు సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటించింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత కొన్నాళ్లు కోమాలో ఉండి, తిరిగి కోలుకుంది. రీసెంట్‌గానే ప్రియుడితో ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఈ  బ్యూటీ.. త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. ఈ క్రమంలోనే జంటగా ఓ ఇంటర్వ్యూకి వచ్చింది. తనకు జరిగిన దారుణమైన అనుభవాల్ని బయటపెట్టింది.

స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన కీర్తి భట్.. 2019లో 'మనసిచ్చి చూడు' అనే సీరియల్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 'కార్తీకదీపం'లోనూ నటించింది. 2022లో ప్రసారమైన బిగ్‌బాస్ షోలో ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. ప్రస్తుతం 'మధురానగరిలో' సీరియల్ చేస్తోంది. 2017లో కీర్తి భట్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవగా.. ఈమె తల్లిదండ్రులు, అన్న-వదిన మృత్యువాతపడ్డారు. అదృష్టం బాగుండి కీర్తి ప్రాణాలతో బయటపడింది. కానీ కొన్నాళ్ల పాటు కోమాలో ఉండి వచ్చింది. అప్పుడే దారుణమైన సంఘటనలు జరిగాయని కీర్తి చెప్పుకొచ్చింది.

'ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయిన తర్వాత నన్ను మంగళూరు తీసుకెళ్లారు. అక్కడే 35 రోజులు ఉండాల్సి వచ్చింది. అక్కడ నాకు చాలా చేదు అనుభవాలు ఎదుర్కొన్నా. నన్ను ఎక్కడెక్కడో టచ్ చేసేవారు. తెలుస‍్తుంది కానీ స్పర్మ లేకపోవడం వల్ల నెట్టేయడానికి కూడా బలముండేది కాదు. కోలుకున్న తర్వాత అక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా వచ్చేశాను. ఎటైనా వెళ్లాలంటే డబ్బులు కావాలి. ఆటో వాళ్ల దగ్గరకి వెళ్తే.. '200 ఇస్తా వస్తావా' అంటే సరే వస్తానని అనేదాన్ని. తర్వాత వాళ్ల లుక్ చూసి అర్థమయ్యేది' అని కీర్తి భట్ తనకెదురైన దారుణాల్ని బయటపెట్టింది.
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)