Breaking News

మమ్మల్ని కలిపింది అదే.. త్వరలో మా కాంబోలో సినిమా!

Published on Tue, 10/31/2023 - 04:37

‘‘నేను, దర్శకులు నాగ్‌ అశ్విన్, తరుణ్‌ భాస్కర్, సందీప్‌ రెడ్డి వంగా వేర్వేరు చోట్ల పెరిగాం. మా నేపథ్యాలు వేరు..  మమ్మల్ని సినిమా కలిపింది. ‘పెళ్ళి చూపులు’తో నన్ను హీరోగా పరిచయం చేశాడు తరుణ్‌ భాస్కర్‌. ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’తో కొందరు కొత్తవాళ్లకు కెరీర్‌ ఇచ్చాడు. ఇప్పుడు ‘కీడా కోలా’లోనూ ప్రతిభ ఉన్న కొత్తవాళ్లు కనిపిస్తున్నారు. తరుణ్‌కి తనపై, తన కథలపై చాలా నమ్మకం. ఈ విషయంలో అతన్ని గౌరవిస్తాను.

ఇండస్ట్రీకి దొరికిన అదృష్టం తను’’ అని హీరో విజయ్‌ దేవరకొండ అన్నారు. తరుణ్‌ భాస్కర్‌ దాస్యం దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కీడా కోలా’. రానా సమర్పణలో కె. వివేక్‌ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్‌ కౌశిక్, శ్రీనాద్‌ నిర్మించిన ఈ చిత్రం నవంబర్‌ 3న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ–‘‘తరుణ్‌ భాస్కర్‌పై ఉన్న నమ్మకంతో చెబుతున్నా.. ‘కీడా కోలా’ మజా ఇస్తుంది.

తర్వలో మా ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుంది’’ అన్నారు. సీనియర్‌ నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ–‘‘డైరెక్టర్‌ జంధ్యాలగారి సినిమాలు చేస్తున్నప్పుడు వినోదం ఎంత హాయిగా పండిందో మళ్లీ ‘కీడా కోలా’కి అలాంటి అనుభూతి కలిగింది’’ అన్నారు. ‘‘నా ‘పెళ్ళి చూపులు, ఈ నగరానికి ఏమైంది’ చిత్రాల విడుదలప్పుడు చిన్న భయం ఉండేది. ప్రేక్షకుల స్పందన తెలుసుకునేందుకు థియేటర్‌ బయటే తిరిగేవాడిని. ‘కీడా కోలా’ విషయంలో ఆ భయం లేదు’’ అన్నారు తరుణ్‌ భాస్కర్‌. ‘‘రెండు గంటల ΄ాటు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు’’ అన్నారు నిర్మాతలు సాయికృష్ణ గద్వాల్, శ్రీ΄ాద్‌.

Videos

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)