చిరు, వెంకీ ఊరమస్ స్టెప్స్..!
Breaking News
మ్యూజిక్ డైరెక్టర్‌కు జోడీగా నటి 'కయదు లోహర్'
Published on Sun, 12/28/2025 - 13:06
ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్‌కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ఇమ్మోర్టల్ చిత్రం ఒకటి. ఇందులో ఆయనకు జంటగా కయదు లోహర్ నటిస్తున్నారు. కింగ్‌స్టన్ చిత్రం తరువాత జీవీ ప్రకాష్ కుమార్ నటిస్తున్న చిత్రం ఇది. అదేవిధంగా డ్రాగన్ చిత్రం తరువాత కయదులోహర్ నటిస్తున్న తమిళ చిత్రం కూడా ఇదే.. మారియప్పన్ చిన్నా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అరుణ్‌కుమార్ ధనశేఖరన్ నిర్మిస్తున్నారు. శ్యామ్.సీఎస్ సంగీతాన్ని, అరుణ్ రాధాకష్ణన్ చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు.

టీజర్‌ను చూస్తుంటే ఇది సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ కథా చిత్రం అనిపిస్తోంది. ప్రేమతో పాటు అనూహ్య సంఘటనలు టీజర్‌లో కనిపిస్తాయి. ఏలియన్ లాంటి ఒక వింత మనిషి కూడా కనిపించడంతో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంటోంది. ఇమ్మోర్టల్ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. జీవీ కథానాయకుడిగా మంచి హిట్ చూసి చాలా కాలమైంది. మరి ఈ చిత్రం ఏ మాత్రం సక్సెస్ అవుతుందో చూడాలి.
Tags : 1