Breaking News

నన్నే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు..?

Published on Thu, 11/20/2025 - 07:46

నటీనటులు ప్రశంసలనే  కాదు విమర్శలను ఎదుర్కోక తప్పదు. అలా అభినందనలకు ఉప్పొంగేవారు, విమర్శలను మాత్రం తట్టుకోలేరు. ఇది వాస్తవం. ఇప్పుడు నటి కయాదు లోహర్‌ పరిస్థితి కూడూ ఇలాంటిదే. 2021లో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు కన్నడం, మలయాళం, తెలుగు, మరాఠీ, బెంగాళీ భాషల్లో నటిస్తూ పాన్‌ ఇండియా నాయకిగా పేరు తెచ్చుకుంటున్నారు. అయితే తమిళంలో నటించిన డ్రాగన్‌ చిత్రానికి ముందు ఈ భామకు అంత పేరు లేదు. ఎప్పుడైతే ప్రదీప్‌ రంగనాథ్‌తో డ్రాగన్‌ చిత్రంలో నటించారో అప్పటి నుంచి ఒక్క సారిగా స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి చేరుకున్నారు.

ప్రస్తుతం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా ఇటీవల ఒక నటి బరువుపై జరిగిన చర్చలో తలదూర్చిన కయాదు లోహర్‌పై కూడా విమర్శలు రావడం మొదలెట్టాయి. దీంతో తనను టార్గెట్‌ చేస్తున్నారని ఈ అమ్మడు వాపోతున్నారు. దీని గురించి కయాదు లోహర్‌ ఓ యూట్యూట్‌ ఛానల్‌కు ఇచ్చిన భేటీలో తన గురించి జరుగుతున్న విమర్శలు చాలా వేదనకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఒక సంప్రదాయబద్దమైన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని తానని అన్నారు. తన గురించి వెనుక విమర్శించినా బాధపడకపోయినా అది తనను వేధిస్తూనే ఉంటుందన్నారు. అసలు తనను ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. 

కాగా ప్రస్తుతం ఈ భామ తమిళంలో నటుడు అధర్వకు జంటగా నటిస్తున్న ఇదయం మురళి అనే చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అదే విధంగా జీవీ ప్రకాశ్‌కు జంటగా ఆమ్మార్టల్‌ అనే చిత్రం నిర్మాణ దశలో ఉంది. కాగా నటుడు శింబు సరసన ఒక చిత్రంలో నటించనున్నారు.అదే విధంగా నటుడు దనుష్‌కు జంటగా నటించనున్న చిత్రానికి లబ్బర్‌ బంతు చిత్రం ఫేమ్‌ తమిళరసన్‌ పచ్చముత్తు దర్శకత్వం వహించనున్నారు. వీటితో పాటూ కన్నడం, తెలుగు, మలయాళం భాషల్లోనూ ఒక్కో చిత్రంలో నటిస్తున్నారు.     

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)