Breaking News

డ్రాగన్‌ బ్యూటీకి అదృష్టం.. బిగ్‌ ఛాన్సులతో బిజీ

Published on Sat, 05/10/2025 - 07:09

చిత్రపరిశ్రమలో ఎవరికి ఎప్పుడు అదృష్టం వరిస్తుందో తెలియదు. అలా ఒక్క సక్సెస్‌ వచ్చిందంటే ఆ తరువాత అవకాశాలు వరుసకడతాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే స్టార్‌డమ్‌ వచ్చేస్తుంది. నటి  కయదు లోహర్ పరిస్థితి అంతే. గత ఏడేళ్ల క్రితం మాతృభాషలో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ ఈమె. అప్పటి నుంచి మంచి అవకాశాల కోసం పోరాడుతునే ఉంది. కాగా ఏడాది క్రితం తన పోరాటానికి ఫలితం దక్కింది. తమిళంలో ప్రదీప్‌ రంగనాథన్‌తో డ్రాగన్‌ చిత్రంలో నటించే లక్కీచాన్స్‌ వరించింది. ఈ ఏడాది ప్రథమార్థంలో తెరపై వచ్చిన డ్రాగన్‌ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం అంత పెద్ద హిట్టు అవుతుందని, తనకు క్రేజ్‌ తెచ్చిపెడుతుందని బహుశా కయదు లోహర్ కూడా ఊహించి ఉండదు. 

అంతే ఇప్పుడు కోలీవుడ్‌లోనే కాదు దక్షిణాది చిత్ర పరిశ్రమ అంతా ఈమెను గుర్తించింది. అవకాశాలను అందిస్తోంది.  నాని సినిమా "ది ప్యారడైజ్"లో కయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అధికారికంగా ప్రకటన రావడమే ఇక మిగిలి ఉంది. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఆపై కోలీవుడ్‌లో నటుడు అధర్వకు జంటగా హృదయం మురళి చిత్రంలో నటిస్తోంది. తాజాగా శింబు సరసన ఆయన 49వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోంది. 

అంతేకాదు సంగీత దర్శకుడు, జీవీ ప్రకాష్‌కుమార్‌తో జతకట్టే లక్కీచాన్స్‌ వరించింది. ఈ చిత్రాన్ని మారియప్పన్‌ చిన్నా దర్శకత్వం వహించనున్నారు. అరుణ్‌కుమార్‌ ధనశేఖరన్‌ నిర్మించనున్న ఈ చిత్రానికి శ్యామ్‌ సీఎస్‌ సంగీతాన్ని అందించనున్నారు. కాగా జీవి ఇంతకుముందు తన 25 చిత్రం కింగ్‌స్టన్‌ చిత్రంతో తెరపైకి వచ్చారు. తాజాగా ప్రస్తుతం ఇడిముళక్కం, 13, బ్లాక్‌మెయిల్‌ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిని పూర్తి చేసిన తరువాత కయాడులోహర్‌తో జతకట్టే ప్రయత్నం చేస్తారో, వాటితో పాటు ఈ చిత్రాన్ని చేస్తారో తెలియాల్సి ఉంది.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)