Breaking News

ఓటీటీలోకి వచ్చేసిన తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Published on Sat, 06/08/2024 - 15:09

మరో క్రేజీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజై హిట్ కొట్టినప్పటికీ.. పెద్దగా టైమ్ తీసుకోకుండా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. నెలలోపే ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా స్ట్రీమింగ్ చేసేస్తున్నారు. ఇది తమిళ మూవీ. కానీ తెలుగులో నేరుగా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది చూద్దాం.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)

తమిళ హీరో కవిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'స్టార్'. సినిమా హీరో అవ్వాలనుకునే ఓ యువకుడి కథతో దీన్ని తెరకెక్కించారు. మే 10న తమిళంలో రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీని తెలుగు వెర్షన్ కూడా థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు. కానీ ఎందుకో కుదర్లేదు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల చేశారు. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో 'స్టార్' స్ట్రీమింగ్ అవుతోంది.

'స్టార్' కథ విషయానికొస్తే.. పాండియన్ (లాల్) ఓ ఫొటోగ్రాఫర్. కొడుకు కలై (కవిన్)ని సినిమా యాక్టర్ చేయాలని అనుకుంటాడు. తండ్రి ప్రోత్సాహం వల్ల చిన్నప్పటి నుంచే సినిమాలంటే పిచ్చితో కలై పెరుగుతాడు. పెరిగి పెద్దయిన తర్వాత ముంబైలో యాక్టింగ్ కోర్సు పూర్తి చేస్తాడు. హీరోగా అవకాశం వస్తుంది. కానీ ఓసారి యాక్సిడెంట్ అయి ముఖమంతా అందవికారంగా తయారవుతుంది. ఇలాంటి కలై.. చివరకు యాక్టర్ అయ్యాడా? లేదా? అనేదే తెలియాలంటే 'స్టార్' చూసేయాల్సిందే.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)