దశాబ్ధాల బంధానికి బిగ్‌బి కటీఫ్‌..కౌన్‌ బనేగా కెబీసీ పతి?

Published on Fri, 05/23/2025 - 10:06

కౌన్‌ బనేగా కరోర్‌ పతి(Kaun Banega Crorepati ) అంటే అమితాబ్, అమితాబ్‌ అంటే కెబిసి  అన్నంతగా పెనవేసుకుపోయిన బంధం తెగిపోనుందా? దేశంలో మరెన్నో టీవీ షోలకు ఊపిరిపోసిన ఆ టెలివిజన్‌ షో సమర్పకుడికి స్థాన చలనం తప్పదా? భారతీయ టెలివిజన్‌ రంగంలో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారుతున్న వార్త ఇది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఐకానిక్‌ క్విజ్‌ షోకు సారధ్యం వహించిన  లెజెండరీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇక ఆ బాధ్యతకు గుడ్‌ బై చెప్పనున్నారు.  

రెండున్నర దశాబ్ధాల క్రితం అంటే 2000లో ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క  మూడవ సీజన్‌ మినహా అమితాబ్‌ బచ్చన్‌(Amitabh Bachchan) ఫేస్‌ ఆఫ్‌ కెబిసీగా  ఉన్నారు. ఒక్క 3వ సీజన్‌ను మాత్రం షారుఖ్‌ ఖాన్‌ హోస్ట్‌ చేశారు. ఆ ఒక్క సీజన్‌ తప్ప మరెప్పుడూ ఆ షోకి దూరం కాని, ఈ 81 ఏళ్ల బాలీవుడ్‌ స్టార్‌...వ్యక్తిగత కారణాల వల్ల షో నుంచి నిష్క్రమిస్తున్నారని ఇటీవలి నివేదికలు ధృవీకరిస్తున్నాయి.  

ఇది అభిమానులను ఆశ్చర్యపరిచేది మాత్రమే కాదు ఎన్నో జ్ఞాపకాలను మేల్కొలిపే వార్త కూడా. ఈ విజయవంతమైన షోని అందిస్తున్న సోనీ టీవీ ఇంకా ఈ మార్పును ధృవీకరించనప్పటికీ త్వరలో ప్రారంభం కానున్న సీజన్‌ 17 కోసం బిగ్‌ బి స్థానంలో కొత్త హోస్ట్‌ రావచ్చనే సంకేతాలు బలంగా వెలువడుతున్నాయి. దీంతో తదుపరి షో ప్రెజెంటర్‌ ఎవరు అనేదానిపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ షో పట్ల ఎంత ఆసక్తి ఉన్నప్పటికీ.. అత్యంత ప్రభావం చూపిన బిగ్‌ బీ ఛెయిర్‌లో కూర్చోవడానికి బాలీవుడ్‌ ప్రముఖులు ఎవరూ అంతగా ముందుకు రావడం లేదని సమాచారం.  

ఈ నేపధ్యంలో బాలీవుడ్‌ హంగామా నుంచి అందుతున్న ఒక నివేదిక ప్రకారం, బాలీవుడ్‌ ’భైజాన్‌’ – సల్మాన్‌ ఖాన్‌(Salman Khan) తో షోరన్నర్లు ముందస్తు చర్చలు జరుపుతున్నారంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, బిగ్‌ బాస్‌ షో ద్వారా  చిన్న తెరపై బిగ్‌ బీ తర్వాత ఆ స్థాయిలో  పేరుగాంచిన సల్లూ భాయ్‌ భారతదేశపు అత్యంత విజయవంతమైన పురాతన షో... కేబీసీకి కొత్త హోస్ట్‌గా రానున్నాడు. 

ఈ వార్తల నేపధ్యంలో ‘‘ సల్మాన్‌ ఖాన్‌ కు ఉన్న విస్త్రుత ప్రజాదరణ, ఆయనను బిగ్‌ బికి సరైన వారసుడిగా మార్చగలదని టీవీ పరిశ్రమలోని వ్యక్తులు భావిస్తున్నారు., ‘సల్మాన్‌ చిన్న తెరకు ఇప్పటికే చిరపరిచితమైన స్టార్‌. పైగా ఆయన మారుమూల కేంద్రాలలోని ప్రేక్షకులతో సైతం బలమైన అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. ప్రతిదీ సరిగ్గా జరిగితే, అతను ఈ షోను తుఫానుగా తీసుకెళ్లగలడు‘ అని ఒక బాలీవుడ్‌ మీడియా పేర్కొంది.

సల్మాన్‌ ఖాన్‌ నిజంగా అమితాబ్‌ బచ్చన్‌ స్థానంలోకి వస్తే, అభిమానులు ఆయనను  నిశితంగా గమనిస్తారు. బిగ్‌ బి  అత్యున్నత స్థాయి ప్రజెంటేషన్‌తో పోలికలు తప్పవు. అయితే సల్మాన్‌ ఖాన్‌ కు వీక్షకుల్లో ఉన్న ఆకర్షణ  మాస్‌ అప్పీల్‌ కొత్త తరం ప్రేక్షకులను ఆకర్షించవచ్చు. ఏదేమైనా కేబీసీ సీజన్‌ 17 వచ్చే ఆగస్టులో  ప్రారంభమయే అవకాశం ఉంది, ఈ నేపధ్యంలో ప్రస్తుతానికి, అధికారిక ప్రకటన కోసం అందరి దృష్టి సోనీ టీవీపైనే  ఉంది.

Videos

అసెంబ్లీలో ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ఫస్ట్ స్పీచ్

అసెంబ్లీలో కేసీఆర్ ను పలకరించిన సీఎం రేవంత్

అండర్-19 వరల్డ్ కప్ టీమ్ వచ్చేసింది.. అందరి కళ్లు అతడిపైనే..!

రెడ్ బుక్ ఆర్డర్.. పోలీసులు జీ హుజూర్

రియల్ సైకో! తొందర పడకు..

పవన్ కు ప్రతి నెల 70 కోట్ల ప్యాకేజీ!

Watch Live: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నిక

రైలు ప్రమాదంపై YS జగన్ దిగ్భ్రాంతి

ల్యాప్‌టాప్‌ల కోసం ఎగవడ్డ జనం

Photos

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు