Breaking News

KBC 15: ముగిసిన కేబీసీ 15వ సీజన్‌.. అమితాబ్‌ ఎమోషనల్‌

Published on Sun, 12/31/2023 - 09:44

కొన్ని రియాల్టీ షోల ద్వారా హోస్టింగ్‌ చేసిన సెలెబ్రిటీలకు పేరొస్తుంది. మరికొన్ని రియాల్టీ షోలకు మాత్రం హోస్టింగ్‌ చేసిన సెలెబ్రిటీ ద్వారానే మంచి గుర్తింపు వస్తుంది. అలాంటి రియాల్టీ షోలలో`కౌన్ బనేగా కరోడ్‌పతి` ఒకటి. ఈ షో పేరు చెప్పగానే అందిరికి గుర్తొచ్చే పేరు అమితాబ్‌ బచ్చన్‌. ఈ షో సక్సెస్‌లో అబితాబ్‌ కీలక పాత్ర పోషించాడు.

ఇది కేవలం జ్ఞానాన్ని మాత్రమే అందించి షో కాదు.. ఎన్నో అనుభూతులను కూడా పంచుతుంటుంది. హాట్‌సీట్‌లో కూర్చొని అబితాబ్‌ చెప్పే విషయాలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయి. ఇప్పటి వరకు 14 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 15వ సీజన్‌ని కూడా పూర్తి చేసుకుంది. డిసెంబర్‌ 29న చివరి ఎపిసోడ్‌ ప్రసారమవ్వగా.. షోకి వచ్చిన ప్రేక్షకులతో పాటు అబితాబ్‌ కూడా ఎమోషనల్‌ అయ్యారు. 

(చదవండి: Year End 2023: హిట్లు తక్కువ..ఫ్లాపులెక్కువ)

`లేడీస్ అండ్ జెంటిల్మెన్.. మేం వీడ్కోలు పలుకుతున్నాం. ఈ వేదిక రేపట్నుంచి కనిపించదు. రేపట్నుంచి మేం ఇక్కడకు రావడం లేదు అని చెప్పాలనిపించడం లేదు. నేను, అమితాబ్ బచ్చన్, ఈ సీజన్‌లో చివరి సారిగా నేను చెప్పేది ఒక్కటే.. గుడ్ నైట్.. గుడ్ నైట్’ అంటూ అమితాబ్‌ భావోద్వేగానికి గురయ్యారు. 

(చదవండి: Rewind 2023: బడ్జెట్‌తో పనిలేని బంపర్‌ హిట్స్)

అమితాబ్‌తో పాటు షోకి వెళ్లిన ఆడియన్స్‌ కూడా ఎమోషనల్‌ అయ్యారు. ‘మేం దేవుడిని చూడలేదు కానీ ఆ దేవుడికి అత్యంత ఇష్టమైన వ్యక్తిని చూస్తున్నాం’అంటూ ఓ ప్రేక్షకురాలు చెప్పడంతో వేదిక అంతా చప్పట్లతో మారుమ్రోగింది. 

కాగా, చివరి ఎపిసోడ్‌కి విద్యాబాలన్‌, షీలా దేవి, షర్మిలా ఠాగూర్‌, సారా అలీఖాన్‌ విచ్చేసి సందడి చేశారు. ఇదే చివరి ఎపిసోడ్‌. ఇకపై ఇక్కడకు రాలేము అనే మాటలు చెబుతున్నందుకు బాధగా ఉంది. ఇలాంటి రోజు వస్తుందని ముందే తెలుసు. నా ప్రేక్షకులతో ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. అయితే ఇది ఇక్కడితో ఆగిపోకూడదని కోరుకుంటున్నాను’అని అమితాబ్‌   అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)